మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా ట్రైలర్ వచ్చేసింది.మెగాస్టార్ చిరంజీవి ఈసినిమా ట్రైలర్ ను లంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.ఓ కూలీ మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు అనే పాయింట్ తో తెరకెక్కింది ఈసినిమా. యాక్షన్ ,ఎమోషన్స్ సన్నివేశాలను మిక్స్ చేసి ట్రైలర్ ను కట్ చేశారు.ఇందులో వరుణ్ రెట్రో లుక్ ఆకట్టుకుంది. డైలాగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్స్ కూడా బాగున్నాయ్ ఓవరాల్ ట్రైలర్ మంచి ఇంపాక్ట్ చూపించేలానే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే భారీ పోటీ మధ్య మట్కా థియేటర్లలోకి రానుంది.మట్కా వస్తున్న రోజే సూర్య కంగువా కూడా విడుదలవుతుంది.దాంతో మట్కా క్లాష్ ఎదుర్కోనుంది.మరోవైపు ఈసినిమా విజయం వరుణ్ కు కీలకం కానుంది.వరుణ్ గత చిత్రాలు అనుకున్న విజయాన్ని అందించలేకపోయాయి.దాంతో మట్కా తోనైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. గత సినిమాలతో పోలిస్తే మట్కా కు బజ్ ఉండడం అడ్వాంటేజ్ కానుంది.
పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్,ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.నవంబర్ 14న మట్కా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: