యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క నిన్న విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా పడగా వాటితో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 6.18కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. దాంతో క కిరణ్ కెరీర్ లోనే బిగెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది.మౌత్ టాక్ బాగుండడంతో ఈవీకెండ్ లో సూపర్ వసూళ్లను దక్కించుకోనుంది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది. క్లీన్ హిట్ కావాలంటే 20కోట్ల పైనే రాబట్టాల్సివుంది.కంగువా వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సోలో రిలీజ్ అయితే క ఊహించని వసూళ్లను రాబట్టుకొనేదే కానీ ఈ సినిమాతో పాటు లక్కీ భాస్కర్, అమరన్ ,బఘీర కూడా విడుదలయ్యాయి.వీటికి కూడా పాజిటివ్ టాక్ రావడం తో క కు గట్టి పోటీ ఎదరువుతుంది.భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సుజీత్,సందీప్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు.
ముఖ్యంగా సినిమాలో చివరి 20నిమిషాలు హైలైట్ గా నిలిచింది.సామ్ సీఎస్ సంగీతం అందించగా చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.ఇక ఈసినిమాతో కిరణ్ అబ్బవరం వరస పరాజయాలకు బ్రేక్ పడనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: