సౌత్ నుండి ఈ దీపావళికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు సూపర్ రన్ ను కొనసాగిస్తున్నాయి.ఇక వచ్చే వారం నోటెడ్ మూవీస్ రిలీజ్ అవ్వడం లేదు కానీ ఆ నెక్స్ట్ వీక్ మచ్ అవైటెడ్ సూర్య కంగువా రిలీజ్ కానుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.ఇక ఈసినిమా నుండి రెండో ట్రైలర్ ను విడుదలచేయనున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఇప్పుడు మరో ట్రైలర్ ను వదలనున్నారు.సెకండ్ ట్రైలర్ సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది.1:33 నిమిషాల నిడివి తో రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ ట్రైలర్ లో కంగువా ను పరిచయం చేయగా సెకండ్ ట్రైలర్ లో ఫ్రాన్సిస్ పరిచయం చేయనున్నారు.ఈసినిమాలో సూర్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.అందులో ఒకటి కంగువా కాగా మరొకటి ఫ్రాన్సిస్.రేపు సెకండ్ ట్రైలర్ బయటికి వచ్చే ఛాన్స్ వుంది.శివ తెరకెక్కించిన ఈసినిమాలో దిశా పటాని ,బాబీ డియోల్ ,యోగిబాబు ,రెడిన్ కింగ్స్ లే కీలక పాత్రల్లో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ నిర్మించాయి.కంగువా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా వుంది.నవంబర్ 14న భారీ స్థాయిలో విడుదలకానుంది.ఈసినిమా విజయంపై కంగువా టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.హిట్ టాక్ వస్తే కంగువా మొదటి రోజే 100కోట్ల మార్క్ ను దాటనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: