తమిళ హీరో శివ కార్తికేయన్ అమరన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ వసూళ్లను రాబడుతుంది.మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈసినిమా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.మొదటి రోజు కంటే కొంచెం అటు ఇటుగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.దాంతో రెండు రోజుల్లో ఈసినిమా 70కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈరోజుతో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.ఇంతకుముందు శివ కార్తికేయన్ డాక్టర్ ఫుల్ రన్ లో 100కోట్ల వసూళ్లను రాబట్టగా అమరన్ కేవలం మూడు రోజుల్లోనే ఆ ఫీట్ సాధించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులోనూ ఈసినిమా అదరగొడుతుంది.రెండు రోజుల్లో దాదాపు 9 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈరోజు తో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.టాలీవుడ్ హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈసినిమాను ఇక్కడ రిలీజ్ చేసింది.ఫుల్ రన్ లో ఈసినిమా బయ్యర్లకు భారీ లాభాలను తీసుకురానుంది.ఓవరాల్ గా ట్రెండ్ చూస్తే అమరన్ ఫుల్ రన్ లో 200కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేయనుంది.అదే జరిగితే శివ కార్తికేయన్ కు ఇదే మొదటి 200కోట్ల సినిమా కానుంది.
రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈసినిమాలో మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి పాత్రలో సాయి పల్లవి నటించింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ప్రముఖ హీరో కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























