బావమరిది నిశ్చితార్థం.. ఫ్యామిలీతో హాజరైన ఎన్టీఆర్‌

Jr NTR Attends His Brother-in-law Narne Nithiin and Shivani Engagement

టాలీవుడ్ యంగ్ హీరో ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం శివాని తాళ్లూరితో జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో సహా హాజరై సందడి చేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నార్నే నితిన్‌, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతికి సోదరుడు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బావమరిది ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమంలో ఈ దంపతులు పాల్గొన్నారు. తనయులు అభయ్‌ రామ్, భార్గవ్‌ రామ్ ఇద్దరితో కలిసి వచ్చిన ఎన్టీఆర్, ప్రణతి దంపతులు కార్యక్రమం మొత్తం దగ్గరుండి చూసుకున్నారు.

ఇక నార్నే నితిన్‌ నిశ్చితార్థం వేడుకకు ఎన్టీఆర్ సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్ కూడా ఫ్యామిలీ‌తో హాజరయ్యారు. అలాగే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ఇంకా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇక ‘మ్యాడ్’ సినిమాతో తెరంగేట్రం చేసిన నార్నే నితిన్.. తొలి సినిమాతోనే ఘన విజయం అందుకున్నారు. ఇటీవలే ఆయన నటించిన ఆయ్‌ చిత్రం విడుదలై సూపర్ హిట్ అందుకుంది. మరోవైపు ‘మ్యాడ్ 2’ మూవీతో త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.