మట్కా ట్రైలర్ రేపే

matka trailer out tomorrow

మెగా హీరో వరుణ్ తేజ్- పలాస ఫేమ్ కరణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మట్కా.రీసెంట్ గా వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాకు బజ్ క్రియేట్ చేసింది.ఇక కీలమైన ట్రైలర్ ను రేపు రిలీజ్ చేయనున్నారు.రేపు ఉదయం 10గంటలకు పార్క్ హయత్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది. మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదగా ఈ ట్రైలర్ లాంచ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో మట్కా వాసు గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. తన లుక్ కూడా ఆకట్టుకుంది.మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్,ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ గా వస్తుంది మట్కా.నవంబర్ 14న రిలీజ్ కానుంది.

అయితే అదే రోజున మచ్ అవైటెడ్ సూర్య కంగువా కూడా రిలీజ్ అవుతుంది దాంతో బాక్సాఫీస్ వద్ద మట్కా భారీ పోటీ ఎదురుకోనుంది.ఇక ఈసినిమా విజయం వరుణ్ తేజ్ కు తప్పనిసరి కానుంది.వరుణ్ గత చిత్రాలు నిరాశపరిచాయి.ఈఏడాది సమ్మర్ లో ఆపరేషన్ వాలెంటైన్ తో రాగ ఆ సినిమాకూడా విజయాన్ని అందించలేకపోయింది.మరి మట్కా అయినా వరుణ్ కు కావాల్సిన విజయాన్ని ఇస్తుందో లేదో.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.