
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 56


మెగాస్టార్‌ను కలిసిన పుష్ప 2 టీమ్
ట్రెండింగ్ అవుతోన్న పుష్ప 2 డైలాగ్స్

పుష్ప 3 కూడా ఉంది

వైభవంగా చైతూ, శోభితల వివాహం

పుష్ప 2.. విడుదలకు ముందే రికార్డుల హోరు

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప 2

జాట్ టీజర్.. పుష్ప 2 థియేటర్లలో ఎక్స్‌క్లూజివ్‌గా

జైలర్ 2 అనౌన్స్ మెంట్ రానుంది

ఓజీ షూటింగ్ అప్డేట్

ఊహించని కాంబినేషన్ ఇది- రామ్ చరణ్

జాట్ టీజర్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో సన్నీడియోల్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ మరియు మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

టాప్ ట్రెండింగ్‌లో గోదారి గట్టు సాంగ్
విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్‌గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వచ్చే జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

మెగాస్టార్‌ను కలిసిన పుష్ప 2 టీమ్
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 టీమ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది.

పుష్ప 2 ఎఫెక్ట్.. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు బంద్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమాలకు సంబంధించి అన్ని బెనిఫిట్ షోలను రద్దు చేసింది. ఇకపై రాష్ట్రంలో ఏ సినిమాకి కూడా వీటికి అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

రాపో22 నుండి రామ్ పోతినేని ఫస్ట్ లుక్ రివీల్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాపో22' (RAPO22 - వర్కింగ్ టైటిల్). ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ మూవీ ఇటీవలే పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే.
ట్రెండింగ్ అవుతోన్న పుష్ప 2 డైలాగ్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఫస్ట్ డే రూ.250-300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని వారు భావిస్తున్నారు.

పుష్ప 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే అందరి కన్ను..
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. అదే 'పుష్ప 2: ది రూల్' సినిమా గురించి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో ఈరోజు గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ధరాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ మరియు బెనిఫిట్ షోలు పడ్డాయి.

ఓటీటీ లోకి వచ్చేసిన అమరన్, మట్కా
మూవీ లవర్స్‌కి ఈరోజు లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఓవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం నేడు థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇదేరోజు రెండు పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ 'మట్కా' మరియు కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ నటించిన బ్లాక్ బస్టర్ 'అమరన్' తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

పుష్ప 3 కూడా ఉంది
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. అదే 'పుష్ప 2: ది రూల్' సినిమా గురించి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో ఈరోజు గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ధరాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ మరియు బెనిఫిట్ షోలు పడ్డాయి.

బాలయ్యతో మళ్ళీ సినిమాపై బెల్లంకొండ కామెంట్స్ వైరల్
'నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసిన 25 ఏళ్ళు అయ్యింది. ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వండర్ ఫుల్ జర్నీ. ఇది నాకు 57వ బర్త్ డే. 2015 లో గంగ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. తర్వాత సినిమా చేయలేదు. మళ్ళీ ఏప్రిల్ నుంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాను' అని అన్నారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్.

వైభవంగా చైతూ, శోభితల వివాహం
హైదరాబాద్‌లోని ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యద్భుతమైన టెంపుల్ థీం సెటప్‌తో ఘనమైన సాంప్రదాయ తెలుగు పెళ్లిలో నాగ చైతన్య, శోభితా ధూళిపాళల వివాహం జరిగినట్టు అక్కినేని కుటుంబం ఆనందంగా ప్రకటించింది. అక్కినేని నాగేశ్వరరావు (ANR) గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి, దిగ్గజ నటుడు-నిర్మాత శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న మొదటి ప్రధాన వేడుక అయినందున ఈ ప్రత్యేక సందర్భానికి గొప్ప సెంటిమెంట్ వాల్యూ వుంది.

రివ్యూ - పుష్ప 2: ది రూల్.. తగ్గేదేలే
అల్లు అర్జున్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో పుష్ప 2 ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా.. అలాగే ఈ పుష్పరాజ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ నేమ్ వరల్డ్ వైడ్‌గా మారుమోగిపోతుంది. 'పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే' అని అన్ని దేశాల్లో వినిపించడం పక్కా. పుష్పరాజ్ డైలాగ్ వైల్డ్ ఫైర్ లెక్కే ఉంది మూవీ.

పుష్ప 2.. విడుదలకు ముందే రికార్డుల హోరు
టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప 2
నేషన్ వైడ్ గా మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ మానియా స్టార్ట్ అయ్యింది.మరి కొద్దీ గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడనున్నాయి.అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓ రేంజ్ లో అవుతున్నాయి.అందులో భాగంగా బుక్ మై షో లో రిలీజ్ కు ముందే 2.3 మిలియన్ల టికెట్స్ అమ్ముడయ్యాయి.ఇప్పటివరకు బాహుబలి 2 & కెజియఫ్ 2 మాత్రమే ఈ మార్క్ ను దాటాయి దాంతో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా పుష్ప 2 నిలిచింది.అలాగే బుక్ మై షో లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ పొందిన తెలుగు సినిమాగా కూడా పుష్ప 2 రికార్డు సృష్టించింది.1.9మిలియన్లకు పైగా ఇంట్రెస్ట్స్ ను సొంతం చేసుకుంది.ఇంతకుముందు రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ 1.8 మిలియన్ల ఇంట్రెస్ట్ తో టాప్ లో…

జాట్ టీజర్.. పుష్ప 2 థియేటర్లలో ఎక్స్‌క్లూజివ్‌గా
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో కోర్ టీమ్ మరియు ప్రత్యేక అతిథులతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హీరో సన్నీడియోల్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ మరియు మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

జైలర్ 2 అనౌన్స్ మెంట్ రానుంది
గత ఏడాది జైలర్ తో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 600 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది.నెల్సన్ దీలిప్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించగా అనిరుధ్ సంగీతం అందించాడు.సన్ పిక్చర్స్ నిర్మించింది.

మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలకృష్ణ
లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు చిరునామా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1991 సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369' NBK ఐకానిక్ చిత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్.

ఓజీ షూటింగ్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.అయితే గత కొన్ని నెలలుగా పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.ఇక ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంకింగ్ లో స్టార్ట్ కానుంది.ఈనెల 6నుండి 20వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.ఇందులో హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఊహించని కాంబినేషన్ ఇది- రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి -దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే.నిన్న ఈసినిమాను అనౌన్స్ చేయగానే హైప్ ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది.ఈఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కు నాని కి కూడా తోడవ్వడంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.నాని ఈదసరాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈసినిమాకు నిర్మాతలు గా వ్యవహరించనున్నారు చిరు కెరీర్ లోనే వయిలెంట్ మూవీ గా తెరకెక్కనుంది. ఆల్రెడీ దసరా తో మాస్ జోనర్ ను సూపర్ గా హ్యాండిల్ చేసి చూపించాడు శ్రీకాంత్. ఇక చిరు నెక్స్ట్ సినిమాను అంతకుమించి తీయనున్నాడు.

పుష్ప 2.. అడ్వాన్స్‌డ్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'పుష్ప 2: ది రూల్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'పుష్ప: ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.