టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో సన్నీడియోల్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ మరియు మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఈ సినిమా టీజర్‌ను పుష్ప 2 థియేటర్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్క్రీనింగ్ చేశారు మేకర్స్. ఇదేక్రమంలో తాజాగా నేడు ఈ టీజర్‌ను డిజిటల్‌గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజర్ అయితే మాంచి మాస్ ఫీస్ట్ లాగా ఉంది. ఇప్పటివరకూ డైరెక్టర్ గోపీచంద్ బాలీవుడ్ హీరోతో ఎలా తీస్తాడా? అని ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు దీనితో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. టీజర్ అయితే అదిరిపోయింది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుస్తుండగా.. రిషి పంజాబి సినిమాటోగ్రఫర్‌గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. కాగా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: