టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో22’ (RAPO22 – వర్కింగ్ టైటిల్). ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ మూవీ ఇటీవలే పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి హీరో రామ్ పోతినేని ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్’ అంటూ రామ్ పాత్రను పరిచయం చేశారు దర్శకుడు మహేష్ బాబు. ఇక రామ్ క్యారెక్టర్ లుక్ చూస్తే.. వింటేజ్ ఫీలింగ్ కలుగుతుంది.
పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్, అన్నిటికి మించి రామ్ ముఖంలో నవ్వు.. ఫస్ట్ లుక్ చూడగానే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతోంది. ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ మొదలైందని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: