ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో పుష్ప 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్ల రూపాయల మార్కును దాటింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటివరకూ రూ.125 కోట్ల వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
ఈ క్రమంలో ‘బాహుబలి 2, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాల అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను అధిగమించింది. ఇక ప్రపపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుండటం, తెలుగు రాష్ట్రాల్లో అధిక టిక్కెట్ ధరలు మరియు ప్రీమియర్ షోల కారణంగా ఈ చిత్రం మొదటి రోజే రూ.300 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా పుష్ప 2 తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం సహా దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతోంది. అయితే ఇప్పటికే మూవీపై మంచి హైప్ క్రియేట్ అయిన కారణంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. మొదటి వారాంతంలో రూ. 500 కోట్లు రాబట్టగలదని, ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టే బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: