మూవీ లవర్స్‌కి ఈరోజు లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఓవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం నేడు థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇదేరోజు రెండు పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘మట్కా’ మరియు కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ నటించిన బ్లాక్ బస్టర్ ‘అమరన్’ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరుణ్ తేజ్ మట్కా మూవీకి థియేటర్లలో ఆశించిన ఫలితం రాలేదు. ఆపరేషన్ వాలంటైన్, గాండీవ ధారి అర్జున, గని సినిమాల తర్వాత వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కరుణకుమార్ దర్శకత్వం వహించగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మట్కా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’. మేజర్ వరదరాజన్ నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో ఈ రీసెంట్ బ్లాక్ బస్టర్ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/0PoNdZCAO5Q/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/apv5v6hkF70/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/ky0m8tJEigw/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/sMvZDLRqDfU/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)