విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్‌గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వచ్చే జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. దీనిలో భాగంగా తాజాగా ‘గోదారి గట్టు’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. 7 మిలియన్లకు పైగా వ్యూస్‌తో టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ రొమాంటిక్ ట్రాక్‌లో లీడ్ పెయిర్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జంటగా అలరించారు. భార్యాభర్తలుగా బ్యూటీఫుల్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్నారు. భాస్కరభట్ల రచించిన ఈ పాట భార్యాభర్తల మధ్య చిలిపి సరదాలని అందంగా ప్రజెంట్ చేసింది. వారు షేర్ చేసుకునే ఆప్యాయత, ప్రేమను ప్రదర్శిస్తూనే, ఒక బాండింగ్‌లో హ్యుమరస్ ఆర్గ్యుమెంట్స్‌ని హైలైట్ చేస్తుంది.
ఈ పాట జానపదం టచ్‌ని కలిగి ఉంది. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. రమణ గోగుల యూనిక్ స్టయిల్ వాయిస్ మెలోడీకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. మధు ప్రియ మెస్మరైజ్ చేసే వాయిస్ కూడా ఆకర్షణను మరింత పెంచింది. గోదారి గట్టు సాంగ్ సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లకు బ్లాక్‌బస్టర్ బిగినింగ్ అందిస్తూ ఆల్బమ్‌లోని తర్వాతి పాటలపై అంచనాలు పెంచింది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్స్ కాగా.. ‘యానిమల్’ ఫేమ్ ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్, తమ్మిరాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండగా.. వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: