దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. అదే ‘పుష్ప 2: ది రూల్’ సినిమా గురించి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో ఈరోజు గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ధరాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ మరియు బెనిఫిట్ షోలు పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో థియేటర్లలో మరోసారి పుష్పరాజ్ పేరు మారుమోగిపోతోంది. 1,000 కోట్ల వసూళ్లతో దిగిన ఈ మూవీ టార్గెట్ అందుకునే దిశగా సాగుతోంది. ఈరోజు వచ్చే కలెక్షన్ బట్టి సినిమా ఎంతమేరకు వెళ్ళనుందనేది తేలిపోతుంది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన హైలైట్‌గా ఉందని, శ్రీవల్లిగా రష్మిక మందన్న అమేజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని అభిమానులు చెబుతున్నారు.
సినిమాకు ఇప్పటికే హిట్ టాక్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో పుష్ప 3పై ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి బలం చేకూరుస్తూ క్లైమాక్స్‌లో మూడో పార్ట్‌కి సంబంధించి లీడ్ ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్. మరోవైపు ఈ చిత్రం విడుదల కావడానికి రెండు రోజులముందే మరో హింట్ కూడా వచ్చేసింది. ఈ మేరకు ఆస్కార్ అవార్డు విన్నింగ్ టెక్నిషియన్, ప్రముఖ సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
రీసెంట్‌గా ఆయన తన బృందంతో కలిసి పుష్ప 2 సినిమాకు ఫైనల్ మిక్సింగ్ కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విషయాన్ని తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. దీనిలో భాగంగా షేర్ చేసిన ఫొటోలో బ్యాక్ గ్రౌండ్‌లో పుష్ప 3 పోస్టర్ లోగో కనిపిస్తోంది. ఇందులో టైటిల్ ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ అని ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా పుష్ప 3 కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మూడో పార్ట్ రావడానికి మరికొన్నేళ్లు పట్టొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: