నేషన్ వైడ్ గా మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ మానియా స్టార్ట్ అయ్యింది.మరి కొద్దీ గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడనున్నాయి.అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓ రేంజ్ లో అవుతున్నాయి.అందులో భాగంగా బుక్ మై షో లో రిలీజ్ కు ముందే 2.3 మిలియన్ల టికెట్స్ అమ్ముడయ్యాయి.ఇప్పటివరకు బాహుబలి 2 & కెజియఫ్ 2 మాత్రమే ఈ మార్క్ ను దాటాయి దాంతో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా పుష్ప 2 నిలిచింది.అలాగే బుక్ మై షో లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ పొందిన తెలుగు సినిమాగా కూడా పుష్ప 2 రికార్డు సృష్టించింది.1.9మిలియన్లకు పైగా ఇంట్రెస్ట్స్ ను సొంతం చేసుకుంది.ఇంతకుముందు రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ 1.8 మిలియన్ల ఇంట్రెస్ట్ తో టాప్ లో ఉండేది. ఇప్పుడు పుష్ప 2 దాన్ని దాటేసింది .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తోపాటు టికెట్ హైక్ తో స్పెషల్ షోస్ పడనుండడం అలాగే తొలి రోజు దాదాపు అన్ని షోస్ సోల్డ్ అవ్వడంతో రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది. అటు హిందీ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్ లో వున్నాయి. బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా హిందీలో రికార్డు సృష్టించిన ఆశ్చర్య పోనక్కరలేదు.ఓవరాల్ గా మొదటి రోజు 250 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది ఈసినిమా.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటించిన ఈసినిమాను సుకుమార్ తెరకెక్కించగా రష్మిక మందన్న కథానాయికగా నటించింది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మించాయి.దాదాపు 12000కుపైగా స్క్రీన్ లలో ఈసినిమా రిలీజ్ అవుతుంది.3గంటల 20నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: