గత ఏడాది జైలర్ తో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 600 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది.నెల్సన్ దీలిప్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించగా అనిరుధ్ సంగీతం అందించాడు.సన్ పిక్చర్స్ నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో నెల్సన్, రజనీని నెక్స్ లెవెల్లో ప్రెజెంట్ చేయగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.ఇక ఈసినిమాకు సీక్వెల్ రానుంది.ఈరోజు జైలర్ 2 ప్రోమో ను కూడా షూట్ చేశారు.రజినీకాంత్ బర్త్ డే కి డిసెంబర్ 12న ఈసినిమా అనౌన్స్ మెంట్ రానుంది.నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈసినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించనుండగా సన్ పిక్చర్స్ నిర్మించనుంది.
ఇక రజినీ ప్రస్తుతం కూలీలో నటిస్తున్నాడు.యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.రజినీకాంత్ బర్త్ డే రోజున ఈసినిమా నుండి కూడా అప్డేట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: