పుష్ప 2.. విడుదలకు ముందే రికార్డుల హోరు

Pushpa 2 The Rule Movie Set Several New Records Before Release

టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన మచ్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సునీల్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మార్కెట్‌లో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.

దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌ ఓపెన్ చేయగా.. దీని ద్వారానే రూ.125 కోట్లకు వసూళ్లను సాధించి దూసుకెళ్తోంది. మరోవైపు ఈరోజు రాత్రికి స్పెషల్ ప్రీమియర్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్.

ఈ క్రమంలో పుష్ప 2 మూవీ విడుద‌ల కాకుండానే పలు రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఆ రికార్డులు ఎంటో ఒక‌సారి చూద్దాం..

  • పుష్ప 2 చిత్రం వ‌రల్డ్ వైడ్‌గా 12,000 స్క్రీన్స్‌లో విడుదల కానుంది.
  • ఒక ఇండియ‌న్ మూవీ ఈ రేంజ్‌లో విడుద‌లవుతుండటం ఇదే మొద‌టిసారి.
  • ఇంత‌కుముందు ఈ రికార్డు దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరిట ఉంది.
  • ఆర్ఆర్ఆర్ చిత్రం 11,000 వేల‌కు పైగా స్క్రీన్స్‌లో విడుదలయ్యింది.
  • పుష్ప 2 థియేట్రికల్ ట్రైల‌ర్ విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే 150 మిలియ‌న్ వ్యూస్ దాటి రికార్డు సృష్టించింది.
  • అలాగే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాట‌లు కూడా ఒక్కొక‌టి 100 మిలియ‌న్లు వ్యూస్ సాధించాయి.
  • సినిమాల బుకింగ్స్ వెబ్‌సైట్స్ బుక్ మై షో, పేటిఏంలో ఈ చిత్రం ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది.
  • బుక్ మై షోలో ఈ సినిమా 1.7 మిలియ‌న్ పైగా ఇంట్రెస్ట్‌ల‌తో దూసుకుపోతోంది.
  • మరోవైపు పేటిఏంలో ఏకంగా 3 మిలియ‌న్స్ ఇంట్రెస్ట్‌లను దాటింది.
  • తద్వారా పేటిఏంలో ఈ రికార్డు సాధించిన మొట్టమొద‌టి చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
  • అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ యిన 24 గంట‌ల్లో కేవ‌లం నార్త్‌ ఇండియాలోనే ల‌క్ష‌కు పైగా టికెట్లు అమ్ముడ‌య్యాయి.
  • అలాగే ఓవ‌ర్సీస్‌లో సైతం ప్రీ సేల్స్‌లో 4 మిలియన్ డాలర్లకు పైగా క‌లెక్ష‌న్ సాధించింది.
  • అతి తక్కువ సమయంలో ఈ మార్క్ అందుకున్న మొద‌టి చిత్రంగా పుష్ప 2 రికార్డుల‌కెక్కింది.
  • బీహార్‌లోని పాట్నాలో జ‌రిగిన పుష్ప 2 ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కు దాదాపు 3 ల‌క్ష‌ల మంది హాజ‌రైనట్టు అంచనా.
  • ఒక సౌత్ సినిమా వేడుకకు హిందీ బెల్ట్‌లో ఇంతమంది హాజరవడం ఇదే తొలిసారి.
  • అలాగే ఈ కార్యక్రమం హైయెస్ట్‌ లైవ్‌ వ్యూస్ అందుకున్న తొలి ఈవెంట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.