టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో కోర్ టీమ్ మరియు ప్రత్యేక అతిథులతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హీరో సన్నీడియోల్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ మరియు మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సంగతి గుర్తుండేవుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి అందించారు మేకర్స్. జాట్ టీజర్‌ను పుష్ప 2 థియేటర్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 ఈ అర్ధరాత్రి నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే.
బాలీవుడ్‌లో యాంగ్రీ యాక్షన్ హీరోగా ప్రసిద్ధి చెందిన సన్నీడియోల్ నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌లో 100 చిత్రాలకు చేరువలో ఉన్నాడు. కాగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ సన్నీకి తమ్ముడు అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబీ NBK109 మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలోనూ ప్రతినాయక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ క్రమంలో సన్నీ డియోల్ కూడా తొలిసారి తెలుగులో, తెలుగు దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ సినిమాలో బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రణ్‌దీప్ స్టైలిష్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. ఇక ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుస్తుండగా.. రిషి పంజాబి సినిమాటోగ్రఫర్‌గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: