టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 టీమ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్‌తో పాటు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, సీఈవో చెర్రీలు చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు గురువారం మెగాస్టార్ ఇంటికి వెళ్లిన పుష్ప టీమ్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, పుష్ప 2 సినిమా విశేషాలను గురించి చిత్ర బృందాన్ని అడిగి తెలుసుకున్నారు.
అయితే చిరుని కలిసినవారిలో హీరో అల్లు అర్జున్ లేరు. ఆయన లేకుండానే డైరెక్టర్, నిర్మాతలు చిరంజీవిని కలవడం ఆసక్తికరంగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు మధ్య గ్యాప్ ఏర్పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 టీమ్‌తో కలిసి చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: