ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఫస్ట్ డే రూ.250-300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని వారు భావిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, మరోవైపు ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐకాన్ స్టార్ పలికిన ఈ సంభాషణలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కథలో భాగంగా సందర్భాన్ని బట్టి వచ్చే ఈ డైలాగ్స్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే మరోవైపు ఈ డైలాగ్స్ కొందరిని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయని కూడా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నెట్టింట వైరల్ అవుతోన్న పుష్ప 2లోని పుష్పరాజ్ డైలాగ్స్ ఇవే..!
- మీ బాస్ కే నేను బాస్..
- మనం టాప్‌లో ఉన్నప్పుడు ఈగోలకు పోకూడదు..
- ఒకడు ఎదుగుతుంటే చాలా మందికి నచ్చదు.. వాడి డౌన్‌ను చూడాలని కోరుకుంటారు..
- పెళ్లాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా..
- నా స్నేహితుడి కోసం తప్పకుండా వస్తా..
వాస్తవానికి ఈ డైలాగ్స్ కథలో భాగంగా సందర్భానుసారంగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని కొందరు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ మూవీలోని ఈ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: