తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమాలకు సంబంధించి అన్ని బెనిఫిట్ షోలను రద్దు చేసింది. ఇకపై రాష్ట్రంలో ఏ సినిమాకి కూడా వీటికి అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె తనయుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరితోపాటు మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.
మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు థియేటర్ మరియు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు ప్రదర్శించడానికి వీలు లేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: