దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. అదే ‘పుష్ప 2: ది రూల్’ సినిమా గురించి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో ఈరోజు గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ధరాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ మరియు బెనిఫిట్ షోలు పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో థియేటర్లలో మరోసారి పుష్పరాజ్ పేరు మారుమోగిపోతోంది. 1,000 కోట్ల వసూళ్లతో దిగిన ఈ మూవీ టార్గెట్ అందుకునే దిశగా సాగుతోంది. ఈరోజు వచ్చే కలెక్షన్ బట్టి సినిమా ఎంతమేరకు వెళ్ళనుందనేది తేలిపోతుంది. సినిమాకు ఇప్పటికే హిట్ టాక్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో తొలిరోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయమై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
తాజాగా రిలీజైన పెద్ద చిత్రాలు కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాయి. ఇటీవలే వచ్చిన ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం తొలిరోజు రూ. 160 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీనికి ముందు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ 180 కోట్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఎంత వసూలు చేస్తుంది? చేయొచ్చు? అని ఇటు అభిమానుల్లోనూ అటు ఇండస్ట్రీలోనూ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు.
సినీ విశ్లేషకుల ప్రకారం.. ఈ సినిమా మొదటిరోజు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకూ కలెక్షన్స్ రాబడుతుందని అంచనా. కాగా ఇండియాలో ఇప్పటివరకు ఫస్ట్ డే కలెక్షన్స్‌లో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా ఆర్ఆర్ఆర్ సినిమా పేరిట రికార్డు ఉంది. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మల్టీ స్టారర్ మొదటి రోజు రూ.275 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: