
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 44


గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్

గేమ్ ఛేంజర్ రాంపేజ్ షురూ

హైందవ గ్లింప్స్ రిలీజ్

సూర్య రెట్రో రిలీజ్ డేట్ ఫిక్స్

పుష్ప 2 రీ లోడెడ్ రిలీజ్ వాయిదా

గేమ్ ఛేంజర్ కు సెన్సేషనల్ బుకింగ్స్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

ఆస్కార్ బరిలో కంగువా

టాక్సిక్ నుంచి యష్ బర్త్ డే పీక్ రిలీజ్

గూఢచారి 2 లో జాయిన్ అయిన వామికా గబ్బి

సంక్రాంతికి వస్తున్నాం మాములుగా ఉండదు -వెంకటేష్

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ లాక్

100 కోట్ల క్లబ్ లో మార్కో

దిల్ రాజు ప్రెస్ మీట్ హైలెట్స్

శర్వా37 టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్
చార్మింగ్ స్టార్ శర్వా 37వ మూవీ #శర్వా37, సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చిత్రీకరణ జరుగుతోంది. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రం జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్ గా ఉండబోతోంది.

గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.దాంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకోంది.ప్రపంచ వ్యాప్తంగా 186 కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్.ఈసినిమా టాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన నాలుగో సినిమాగా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో పుష్ప 2 మొదటి స్థానం లో ఉండగా ఆర్ఆర్ఆర్ , బాహుబలి 2, కల్కి 2898 ఏడి సినిమాలు తరువాతి స్థానంలో వున్నాయి.

గేమ్ ఛేంజర్ రాంపేజ్ షురూ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈసినిమాకు ఆల్ ఓవర్ పాజిటివ్ టాక్ వస్తుంది.ముఖ్యంగా రామ్ చరణ్ నటన ,తమన్ సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.ఇండియన్ 2 తరువాత గేమ్ ఛేంజర్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ కంబ్యాక్ ఇచ్చాడు.ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే సెకండ్ హాఫ్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ నటన అద్భుతం అని చెప్పొచ్చు.ఓవరాల్ గా ఓ మంచి పొలిటికల్ ఎంటర్టైనర్ ను అందించాడు శంకర్.

సంక్రాంతికి వస్తున్నాం అందరు ఎంజాయ్ చేస్తారు- ఐశ్వర్య రాజేష్
విక్టరీ వెంకటేష్,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం.ఇందులో వెంకీ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటించారు. ఈసినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలు వున్నాయి. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మీడియా తో సినిమా గురించి ముచ్చటించారు.

హైందవ గ్లింప్స్ రిలీజ్
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ సినిమా టైటిల్& గ్లింప్స్ ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. అకల్ట్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు హైందవ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఇక 2నిమిషాల 40సెకండ్ల నిడివి తో వచ్చిన గ్లింప్స్ చాలా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా హై క్వాలిటీ విజువల్స్ గింప్స్ లో హైలైట్ అయ్యాయి.ఓ ఆలయం చుట్టూ అల్లుకున్న కథ తో తెరకెక్కుతుంది ఈసినిమా.గ్లింప్స్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ లుక్ లో పవర్ ఫుల్ గా కనిపించాడు.

సూర్య రెట్రో రిలీజ్ డేట్ ఫిక్స్
కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య తన 44వ సినిమా రెట్రో తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.మే 1న విడుదలకానుంది.అయితే అదే డేట్ కు లోకేష్ కనగరాజ్ ,సూపర్ స్టార్ రజినీకాంత్ ల కూలీ దింపాలనుకున్నారు కానీ ఈసినిమా ఆగస్టు కు షిఫ్ట్ కావడంతో రిట్రో ఆ డేట్ ను లాక్ చేసుకుంది.

శర్వా 37 టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో శర్వానంద్ ,సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తన 37వ సినిమా చేస్తున్నాడు.సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను ఈనెల 14న రిలీజ్ చేయనున్నారు.అయితే ఈసినిమాకు టైటిల్ గా ఓ సీనియర్ హీరో మూవీ టైటిల్ ను పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

పుష్ప 2 రీ లోడెడ్ రిలీజ్ వాయిదా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజై నెల దాటుతున్న ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.రీసెంట్ గా దేవర తరువాత మంచి లాంగ్ రన్ ను కనబరుస్తున్న సినిమా పుష్ప 2.ఇక ప్రేక్షకులను మరోసారి థియేటర్లలోకి రప్పించడానికి మేకర్స్ మరో 20 నిమిషాలను సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ న్యూ వెర్షన్ ను ఈనెల 11న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సాంకేతిక సమస్యల వల్ల వాయిదా వేశారు.ఈనెల 17న రీ లోడెడ్ వెర్షన్ రిలీజ్ కానుంది. దాంతో పుష్ప 2 ఈ సంక్రాంతికి నెమ్మదించి ఆతరువాత మళ్ళీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.

గేమ్ ఛేంజర్ కు సెన్సేషనల్ బుకింగ్స్
మచ్ అవైటెడ్ గేమ్ ఛేంజర్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.6ఏళ్ళ తరువాత రామ్ చరణ్ నుండి సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇక సాంగ్స్ చార్ట్ బస్టర్స్ కావడం ట్రైలర్ రికార్డు వ్యూస్ ను రాబట్టుకోవడంతో సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో గేమ్ ఛేంజర్ అదరగొడుతుంది.

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సాంగ్స్ , ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపు అంచనాలు భారీగా వున్నాయ్.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు అనంతపురం లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపాలనుకున్నారు. అయితే నిన్న దురదృష్టవశాత్తు తిరుపతి లో తొక్కిసలాట లో జరగడం తో ఈవెంట్ ను నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆస్కార్ బరిలో కంగువా
తమిళ స్టార్ హీరో సూర్య -డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వచ్చిన పీరియాడికల్ మూవీ కంగువా ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ బరిలో నిలిచింది. ఉత్తమ చిత్రం విభాగంలో ఈసినిమా 97వ అకాడమిక్ అవార్డులకు ఎంపిక అయ్యింది. గ్లోబల్ వైడ్ గా 323 సినిమాలు ఈ జాబితాలో ఉండగా ఇండియా నుండి కంగువా తోపాటు ఆడు జీవితం , సంతోష్ ,స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి.

టాక్సిక్ నుంచి యష్ బర్త్ డే పీక్ రిలీజ్
'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం హీరోగా 'టాక్సిక్' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. యష్ లక్కీ నంబర్ 8 కావడంతో, బెంగళూరులో ఆగస్టు 8న 8-8-8 (2024, ఆగస్టు 8) అనే నంబర్ కలిసి వచ్చేలా సినిమాను ప్రారంభించారు.
శ్రీ తేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు, అల్లు అర్జున్
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్‌ను TFDC ఛైర్మన్ దిల్ రాజు మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. ఈ మేరకు నిన్న సికింద్రాబాద్ బేగంపేట్ మినిష్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న వారు అక్కడ బాలుడిని పరామర్శించారు.

గేమ్ ఛేంజర్ లోని నా పాత్ర కెరీర్ లో బెస్ట్ అవుతుంది - అంజలి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించింది. ఈసందర్భంగా అంజలి మీడియా తో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

గూఢచారి 2 లో జాయిన్ అయిన వామికా గబ్బి
యంగ్ హీరో అడవి శేష్ నుండి నెక్స్ట్ వస్తున్న స్పై థ్రిల్లర్ G2.ఇది సూపర్ హిట్ మూవీ గూడచారికి సీక్వెల్ గా వస్తుంది.వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్ లో పాన్-ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈసినిమా లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రలో నటిస్తున్నాడు.ఇక హిందీ నటి వామికా గబ్బి కూడా ఈసినిమా లో జాయిన్ అయ్యింది. వామికా,అడివి శేష్ సరసన లీడ్‌గా నటిస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్
సాంగ్స్ చార్ట్ బస్టర్స్ కావడంతో సంక్రాంతికి వస్తున్నాంకు హైప్ రాగా నిన్న ట్రైలర్ ను కూడా వదిలారు.ఈ ట్రైలర్ కు కూడా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.చూసిన వారు పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ ట్రైలర్ రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఇప్పటివరకు యూట్యూబ్ లో కోటికి పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో మొదటి స్థానం లో వుంది.ట్రైలర్ కట్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం మాములుగా ఉండదు -వెంకటేష్
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి,బడా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఈ సంక్రాంతికి విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా అవ్వగా నిన్న ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు.ఇందుకోసం నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.ఈ గ్రాండ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం అభిమానులు ఉర్రూతలూగించింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ లాక్
తమిళ హీరో తల అజిత్ ,మార్క్ ఆంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమాతో మైత్రి తమిళం లోకిఎంట్రీ ఇస్తుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను చెప్పేశారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.ఆ డేట్ కు ప్రభాస్ ది రాజాసాబ్ రావాల్సివుంది. అయితే షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడే అవకాశాలు వున్నాయి.దాంతో మైత్రి గుడ్ బ్యాడ్ అగ్లీకి ఆ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

100 కోట్ల క్లబ్ లో మార్కో
మోస్ట్ వైలెంట్ మలయాళం మూవీగా వచ్చిన మార్కో సెన్సేషన్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈసినిమా నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన 9వ సినిమాగా రికార్డు సృష్టించింది. రీసెంట్ గా ఈసినిమా హిందీ తోపాటు తెలుగులోనూ విడుదలైయింది.

దిల్ రాజు ప్రెస్ మీట్ హైలెట్స్
టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వస్తున్నాయి.అవి గేమ్ ఛేంజర్,సంక్రాంతికి వస్తున్నాం.ఇందులో గేమ్ ఛేంజర్ ఈనెల 10న విడుదలకానుండగా సంక్రాంతికి వస్తున్నాం 14న వస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఇందులో అయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.