సాంగ్స్ చార్ట్ బస్టర్స్ కావడంతో సంక్రాంతికి వస్తున్నాంకు హైప్ రాగా నిన్న ట్రైలర్ ను కూడా వదిలారు.ఈ ట్రైలర్ కు కూడా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.చూసిన వారు పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ ట్రైలర్ రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఇప్పటివరకు యూట్యూబ్ లో కోటికి పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో మొదటి స్థానం లో వుంది.ట్రైలర్ కట్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈసినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా ఐశ్వర్య రాజేష్,మీనాక్షిచౌదరి హీరోయిన్లుగా చేశారు.నరేష్ ,వీటివీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తుండగా జనవరి 14న థియేటర్లోకి రానుంది.
ఇక ఇంతముందు అనిల్ ,వెంకటేష్ ,దిల్ రాజు కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.ఇంతకుముందు ఈ కాంబో లో వచ్చిన ఎఫ్ 2 ,ఎఫ్ 3 బ్లాక్ బాస్టర్ అయ్యాయి.ఇక ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయితే హ్యాట్రిక్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: