
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 43


ఈ విజయం తెలుగు ప్రేక్షకులది -విక్టరీ వెంకటేష్

ఎన్టీఆర్ వర్ధంతి.. తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు

దళపతి 69 షూటింగ్ అప్డేట్

లైలా టీజర్ రిలీజ్

డాకు మహారాజ్ 5 డేస్ కలెక్షన్స్

హరి హర వీరమల్లు ఫస్ట్ సింగిల్ రిలీజ్

విజయ్ సేతుపతి 'ACE' పవర్ ప్యాక్డ్ గ్లింప్స్ రిలీజ్

అజిత్ 'పట్టుదల' ట్రైలర్ అదిరిపోయిందిగా

పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ కు టికెట్ ధరల తగ్గింపు

జైలర్ 2 అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్

100కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్

ఎన్టీఆర్.. నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారం - బాలకృష్ణ
లెజెండరీ యాక్టర్, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. తనయుడు, నట వారసుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ మేరకు ఈ ఉదయం సోదరుడు రామకృష్ణతో కలిసి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్దకు చేరుకున్న బాలకృష్ణ తండ్రికి పుష్పాంజలి ఘటించారు.

సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది. మొదటి రోజుకు దీటుగా మూడో రోజు కూడా వసూళ్లను రాబట్టుకుని సునాయాసంగా 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 106కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇందులో షేర్ 50కోట్లు దాటింది.

ఈ విజయం తెలుగు ప్రేక్షకులది -విక్టరీ వెంకటేష్
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఈ సంక్రాంతికి విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

ఎన్టీఆర్ వర్ధంతి.. తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు
లెజెండరీ యాక్టర్, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. ఆయన మనవలు, స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఈ మేరకు ఈ ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్దకు చేరుకున్న నట సోదర ద్వయం తాతకు పుష్పాంజలి ఘటించారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌కు 50 ఏళ్ళు.. నాగార్జున స్పెషల్ వీడియో రిలీజ్
''రోడ్లే లేని రోజుల్లో నాన్నగారు ఇక్కడికివచ్చి ఇంతపెద్ద అన్నపూర్ణ స్టూడియోస్ ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది టెక్నిషియన్స్, కొత్త ఆర్టిస్ట్ లు, కొత్త డైరెక్టర్స్ కు ఉపాధి కల్పించింది. ఎంతో మందికి ఏయన్నార్ స్ఫూర్తి' అన్నారు కింగ్ అక్కినేని నాగార్జున.

దళపతి 69 షూటింగ్ అప్డేట్
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన 69వ సినిమాలో నటిస్తున్నాడు.ఇదే తనకు చివరి సినిమా కానుంది.ఈసినిమా తరువాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఫుల్ బిజీ అవ్వనున్నాడు.ఇప్పటికే పార్టీ ని కూడా స్థాపించగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ బరిలో నిలువనుంది విజయ్ పార్టీ.దాంతో విజయ్ తన 69వ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

లైలా టీజర్ రిలీజ్
మెకానిక్ రాకీ తరువాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా లైలా.రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్. ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. రీసెంట్ గా దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలకాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

డాకు మహారాజ్ 5 డేస్ కలెక్షన్స్
సీనియర్ హీరో బాలకృష్ణ డాకు మహారాజ్ థియేటర్లలో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది. 4రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా నిన్న కూడా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంది దాంతో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 114కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 80కోట్ల షేర్ కాగా ఇప్పటివరకు 74కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.ఈరోజు ఈసినిమా టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అంతేకాదు ఈవారాంతంలో భగవంత్ కేసరి లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేయనుంది.

సంక్రాంతికి వస్తున్నాం 3 డేస్ కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం రాంపేజ్ కొనసాగుతుంది.మొదటి రోజుకు దీటుగా మూడో రోజు కూడా వసూళ్లను రాబట్టుకోవడంతో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 106కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో షేర్ 50కోట్లు దాటింది.ఇక ఈసినిమా నైజాం ,సీడెడ్ , గుంటూరు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.రేపటి తో కంప్లీట్ గా టార్గెట్ ను పూర్తి చేయనుంది.దాంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.

హరి హర వీరమల్లు ఫస్ట్ సింగిల్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు.ఇది రెండు భాగాలుగా విడుదలకానుంది.షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.కుదిరిరితే ఈనెలలోనే బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేయనున్నారు.ఇక ఈసినిమా నుండి మొదటి పాటను ఈరోజు రిలీజ్ చేశారు.మాట వినాలి అంటూ వచ్చిన ఈసాంగ్ కు పవన్ కళ్యాణ్ వోకల్స్ అందించడం విశేషం. ఈ సాంగ్ ను పెంచల్ దాస్ రచించగా కీరవాణి సంగీతం అందించారు.సాంగ్ కూడా వినడానికి బాగుంది.ఇందులో పవన్ లుక్ ఆకట్టుకుంది.తెలుగుతోపాటు తమిళ , కన్నడ , మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సాంగ్ విడుదలైయింది.

విజయ్ సేతుపతి 'ACE' పవర్ ప్యాక్డ్ గ్లింప్స్ రిలీజ్
'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి లీడ్ రోల్ నటిస్తున్న 'ACE' స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది. అరుముగకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

అజిత్ 'పట్టుదల' ట్రైలర్ అదిరిపోయిందిగా
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయార్చి’. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదలవుతోంది. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ కు టికెట్ ధరల తగ్గింపు
భారీ అంచనాల మధ్య గత ఏడాది చివర్లో వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఇండియన్ ఇండస్ట్రీ హిట్ రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. ఈసినిమా 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బాహుబలి 2 ని క్రాస్ చేసింది.ఇప్పటికీ నార్త్ లో డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.ఇప్పటికే హిందీలో 800కోట్లకుపైగా వసూళ్లతో ఆల్ టైం గ్రాసర్ గా రికార్డు నెలకొల్పింది.ఇక ప్రేక్షకులను మరోసారి థియేటర్లలోకి రప్పించడానికి మేకర్స్ మరో 20 నిమిషాల సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ పేరుతో రిలీజ్ చేయనున్నారు.రేపటి నుండి ఈ వెర్షన్ థియేటర్లలోకి రానుంది.ఈ సందర్భంగా నైజాంలో మేకర్స్ టికెట్ ధరలను కూడా తగ్గించారు.

జైలర్ 2 అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్
రెండేళ్ల క్రితం జైలర్ తో వచ్చి ఇండస్ట్రీ హిట్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 600 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా ఈసినిమా దాదాపు 80కోట్ల వసూళ్లతో బ్లాక్ బాస్టర్ అనిపించుకుని భారీ లాభాలను తీసుకొచ్చింది.నెల్సన్ దీలిప్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించగా అనిరుధ్ సంగీతం అందించాడు.సన్ పిక్చర్స్ నిర్మించింది.

నెట్ ఫ్లిక్స్ లోకి రాబోయే తెలుగు సినిమాలు ఇవే
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ థియేట్రికల్ రిలీజ్ తరువాత ఈ ఏడాది కొత్తగా స్ట్రీమింగ్ చేయబోయే తెలుగు సినిమాలను ప్రకటించింది.నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో ఈ లిస్ట్ ను అనౌన్స్ చేసింది.ఇందులో అన్ని మినిమమ్ గ్యారెంటీ సినిమాలు వున్నాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే …పవన్ కళ్యాణ్ ,సుజీత్ ల మచ్ అవైటెడ్ మూవీ ఓజీ స్ట్రీమింగ్ హక్కులను అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.దాదాపు సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈసినిమా.ఈఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.అలాగే నాగ చైతన్య ,సాయి పల్లవి ల తండేల్ తెలుగు తోపాటు మిగితా భాషాల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.చందు మొండేటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా…

సంక్రాంతికి వస్తున్నాం రెండో రోజు కూడా
విక్టరీ వెంకటేష్ ,అనిల్ రావిపూడిల సంక్రాంతికి వస్తున్నాం అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.సంక్రాంతి రోజు విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు ఏకంగా 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి వెంకటేష్ కు కెరీర్ బెస్ట్ అందించింది.ఇక ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఫుల్ గా ఉండడంతో రెండో రోజు కూడా సెన్సేషనల్ హోల్డ్ తో అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది .రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 77కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజు కూడా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో వున్నాయి.గంటకి 20వేలకుపైగా టికెట్లు తెగుతున్నాయి.రేపటితో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. వెంకటేష్ కెరీర్ లో…

100కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్
బాలకృష్ణ డాకు మహారాజ్ 4రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమా 4రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 80శాతం పూర్తి చేసింది. ఈ వీకెండ్ కల్లా టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.బుక్ మై షో లో 10లక్షలకుపైగా టికెట్స్ సేల్ అయ్యాయి.రేపు ఈసినిమా తమిళం లోకూడా విడుదలకానుంది.

సంక్రాంతికి వస్తున్నాంపై మహేష్ బాబు స్పెషల్ రివ్యూ
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ రివ్యూ ఇచ్చారు.

సైఫ్ అలీఖాన్‌పై ఆగంతకుడి దాడి.. స్పందించిన ఎన్టీఆర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసాడు. ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సైఫ్‌ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఘాటి నుండి విక్రమ్ ప్రభు ఫస్ట్ లుక్, బర్త్ డే గ్లింప్స్ రిలీజ్
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.