హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్‌ను TFDC ఛైర్మన్ దిల్ రాజు మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. ఈ మేరకు నిన్న సికింద్రాబాద్ బేగంపేట్ మినిష్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న వారు అక్కడ బాలుడిని పరామర్శించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదే ఘటనలో బాలుడి తల్లి, రేవతి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవతి భర్తను కూడా అల్లు అర్జున్ పరామర్శించి సానుభూతి తెలిపారు. రేవతి మృతి చెందడం తమను తీవ్రంగా కలిచివేసిందని, వారి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇక అల్లు అర్జున్ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు డీసీపీ సాధన రష్మీ ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ట్రీట్మెంట్ చేయించుకుంటున్న పేషంట్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే మళ్లీ ఆసుపత్రికి రావాలంటే తమకు ముందస్తుగా సమాచారం అందించాలని అల్లు అర్జున్‌కు పోలీసులు సూచించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: