దిల్ రాజు ప్రెస్ మీట్ హైలెట్స్

Dil Raju Interacts With The Media Ahead Of Two Major Releases,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Game Changer,Game Changer Movie,Game Changer Telugu Movie,Game Changer Update,Game Changer Ticket,Game Changer Ticket Price,Game Changer Ticket Price In Andhra Pradesh,Game Changer Ticket Rates Hike,Game Changer Movie Ticket Rates,Game Changer Andhra Pradesh Ticket Prices,Game Changer Ticket Prices In AP,AP Ticket Prices,Ram Charan,Shankar,Dil Raju,Dil Raju Interview,Dil Raju Press Meet,Producer Dil Raju Press Meet,Producer Dil Raju Press Meet Highlights,Dil Raju Speech At Game Changer Press Meet,Game Changer Incident,Dil Raju About Game Changer Incident,Dil Raju Comments On Movie Ticket Rates,Game Changer Press Meet

టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వస్తున్నాయి.అవి గేమ్ ఛేంజర్,సంక్రాంతికి వస్తున్నాం.ఇందులో గేమ్ ఛేంజర్ ఈనెల 10న విడుదలకానుండగా సంక్రాంతికి వస్తున్నాం 14న వస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఇందులో అయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు రోజుల్లో గేమ్ ఛేంజ‌ర్‌ కంటెంట్ పంపించేయాలి.ఈసినిమా కోసం నాలుగున్న‌రేళ్లు క‌ష్ట‌ప‌డ్డాం.ఎన్నో ఒడిదుడుకులు చూశాను.రాజమండ్రి లో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్ నా జీవితంలో నేను చూసిన అద్భుత‌మైన ఈవెంట్. దానికి కార‌ణ‌మైన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ గారికి ధ‌న్య‌వాదాలు. అయితే ఈ ఈవెంట్ కు వెళ్లి వస్తు ఇద్దరు అభిమానులు మృతి చెందడం బాధాకరం.వారి కుటుంబాలకు చెరో 5లక్షల సాయం ప్రకటిస్తున్నాం.అంతేకాదు ఆ కుటుంబాలకు అండగా ఉంటాం.

పవన క‌ల్యాణ్ గారే నాకు ఇన్స్పిరేషన్. ఆయన రీ ఎంట్రీ సినిమా వ‌కీల్ సాబ్‌ ను ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టి తీశాం.అయితే కోవిడ్ టైం లో రిలీజ్ అవ్వడం వల్ల ఆశించిన ఫలితం రాలేదు.ఇక వార‌సుడు సినిమాను తమిళ్ సినిమాలానే చూశారు. తెలుగులో స‌రిగా చూడ‌లేదు.అలాగే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ రోజు నా మ‌న‌వ‌డు ఫోన్ చేశాడు. నువ్వు అప్ సెట్ అవ్వొద్దు ,గేమ్ ఛేంజ‌ర్ తో కొడ‌తావులే అని చెప్పడం ఆశ్చ‌ర్యంగా అనిపించింది.అప్ప‌టి నుంచీ ఓ టార్గెట్ పెట్టుకున్నా.

ఇక ఇండియ‌న్ 2 రిజ‌ల్ట్ తో గేమ్ ఛేంజ‌ర్‌ పై ప్రభావం ప‌డింది.రామ్ చ‌ర‌ణ్ త‌ప్ప మా సినిమాకు ప్ల‌స్ పాయింట్ లేదు.నాలుగేళ్ల క్రితం శంక‌ర్ గారు క‌థ చెప్పిన‌ప్పుడు ఏదైతే నమ్మానో అది సినిమాలో వుందా అని మ‌రోసారి ఆలోచించాను.క్రియేటివిటీ విష‌యంలో శంక‌ర్ గారు ఏ నిర్మాత‌కూ ఛాన్స్ ఇవ్వ‌రు. కానీ నేను ఆయ‌న్ని అప్రోచ్ అయ్యేవాడ్ని.ఈ సినిమా మ‌న‌కు చాలా ముఖ్యం..జాగ్ర‌త్త‌గా చేద్దాం అని శంక‌ర్ గారికి చెప్పేవాడ్ని.

తెలుగు ప్రేక్ష‌కులు విజిల్స్ కొట్టే మూమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి. ఈసినిమా తప్పకుండా నాకు ,శంకర్ గారికి కం బ్యాక్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పగలను అని దిల్ రాజు అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.