సంక్రాంతికి వస్తున్నాం అందరు ఎంజాయ్ చేస్తారు- ఐశ్వర్య రాజేష్

Sankranthiki Vasthunam Heroine Aishwarya Rajesh Interview,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sankranthiki Vasthunam Trailer,Victory Venkatesh,Sankranthiki Vasthunam,Sankranthiki Vasthunam Movie,Sankranthiki Vasthunam Telugu Movie,Sankranthiki Vasthunam Movie Updates,Sankranthiki Vasthunam Team Interview,Sankranthiki Vasthunam Movie Team Interview,Sankranthiki Vasthunam Songs,Anil Ravipudi,Meenakshi Chaudhary,Aishwarya Rajesh,Aishwarya Rajesh Movies,Aishwarya Rajesh New Movie,Aishwarya Rajesh About Sankranthiki Vasthunam,Aishwarya Rajesh About Sankranthiki Vasthunam Movie,Aishwarya Rajesh As Bhagyam In Sankranthiki Vasthunam,Aishwarya Rajesh About Her Role Bhagyam In Sankranthiki Vasthunam,Venkatesh,Venkatesh Movie,Heroine Aishwarya Rajesh Exclusive Interview,Aishwarya Rajesh Interview,Aishwarya Rajesh Latest Interview

విక్టరీ వెంకటేష్,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం.ఇందులో వెంకీ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటించారు. ఈసినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలు వున్నాయి. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మీడియా తో సినిమా గురించి ముచ్చటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది?

సుడల్ వెబ్ సిరిస్ షూటింగ్ లో వున్నప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి నుంచి కాల్ వచ్చింది.ఓ క్యారెక్టర్ కి లుక్ టెస్ట్ చేయాలని అన్నారు. నేను చాలా సర్ ప్రైజ్ అయ్యాను. ఆయన సినిమాలన్నీ చూశాను. ఇందులో నా క్యారెక్టర్ కి ఒక యాస వుంది.ఆ యాసతో పాటు ఆ లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చాను.ఓ డైలాగ్ ఇచ్చారు. రెండు లైన్స్ చెప్పగానే చాలని చెప్పి స్క్రిప్ట్ ని నరేట్ చేశారు. నరేషన్ లో పడిపడి నవ్వుకున్నాను.నా కెరీర్ లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ ఇదే. భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెదికారు.ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా వుంది.

తెలుగులో నాకు ఇప్పటివరకూ సరైన డ్యూయెట్ సాంగ్ పడలేదు.ఆ లోటు గోదారి గట్టు పాటతో తీరింది.వెంకటేష్ గారు లాంటి బిగ్ హీరోతో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడం అది ఇంత వైరల్ హిట్ కావడం ఆనందంగా వుంది.అలాగే సినిమాలో పాటన్నీ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పాటలు హిట్ అయితే సగం పాసైపోయినట్లే. ట్రైలర్ ఆ అంచనాలని మరింతగా పెంచింది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా.

వెంకటేష్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ?

బిగినింగ్ లో చాలా భయం వేసింది. ఎందుకంటే భాగ్యం.. మామూలు క్యారెక్టర్ కాదు. కత్తిమీద సాములాంటి క్యారెక్టర్. కొంచెం బ్యాలెన్స్ తప్పినా కష్టమే. ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆడియన్స్ చూస్తున్నప్పుడు జాలి పుట్టే క్యారెక్టర్. చాలా కీలకమైన పాత్ర. కాస్త శ్రుతిమించిన ఓవర్ డోస్ అయిపోతుంది. భాగ్యం పాత్రని అర్ధం చేసుకోవడానికి నాకు పదిరోజులు పట్టింది.

వెంకీ గారు ఎమోషన్స్ అన్నీ నేచురల్ గా వుంటాయి. ఆయన టైమింగ్ అద్భుతం. ఆయనతో కలసి యాక్ట్ చేయడం మామూలు విషయం కాదు. అయితే ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. భాగ్యం క్యారెక్టర్ లో అదరగొడుతున్నావ్ అని మెచ్చుకునే వారు. కానీ డైలాగులు ఇచ్చేటప్పుడు టెన్షన్ వచ్చేసేది. చేతులు వణికేవి. ఒకసారి ఫీవర్ కూడవచ్చింది. వెంకీ గారు, అనిల్ గారి సపోర్ట్ మర్చిపోలేను. వెంకీ గారు చాలా పాజిటివ్ గా వుంటారు. వండర్ ఫుల్ పర్సన్.

భాగ్యం లాంటి క్యారెక్టర్ ఐదారేళ్ళుగా తెలుగు సినిమాల్లో చూడలేదు. చాలా ఫ్రెష్ రోల్. ఇలాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమా వచ్చి చాలా రోజులైయింది. అందరు కనెక్ట్ చేసుకునే సినిమా ఇది.అనిల్ గారు చాలా క్రియేటివ్ గా ఈ కథని చెప్పారు.

మీనాక్షి చౌదరితో యాక్ట్ చేయడం గురించి ?

మీనాక్షి చాలా సింపుల్.తనకి నాకు దగ్గర పోలికలు. డాక్టర్ చదువుకుంది.కష్టపడి పైకి వచ్చింది. తను చాలా స్వీట్. తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మీను సాంగ్ లో తప్పితే.. వెంకటేష్ గారు నేను మీనాక్షి .. ముగ్గురూ సినిమా అంతా ట్రావెల్ అవుతాం. మా ముగ్గురిని చూడాల్సిందే. ఇందులో వెంకీ గారిది మా ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్.

దిల్ రాజు గారి నిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది ?

దిల్ రాజు, శిరీష్ గారి బ్యానర్ లో వర్క్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్.

మీ కథల ఎంపిక ఎలా వుంటుంది ?

సినిమాలో చేసే అవకాశం అందరికీ రాదు. అదొక అదృష్టం. భిన్నమైన కథలు చెప్పడానికి సినిమా గొప్ప వేదిక. నా వరకూ డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఏ పాత్ర చేసినా సోషల్ రెస్పాన్స్ బిలిటీ వుండాలని కోరుకుంటాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.