యంగ్ హీరో శర్వానంద్ ,సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తన 37వ సినిమా చేస్తున్నాడు.సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను ఈనెల 14న రిలీజ్ చేయనున్నారు.అయితే ఈసినిమాకు టైటిల్ గా ఓ సీనియర్ హీరో మూవీ టైటిల్ ను పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక శర్వానంద్ ఈసినిమాతోపాటు ప్రస్తుతం తన 36వ సినిమాలో కూడా నటిస్తున్నాడు.అభిషేక్ కంకర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.ఇది కూడా ఈ ఏడాదే విడుదలకానుంది.
ఇవేకాకుండా శర్వా రీసెంట్ గా తన 38వ సినిమాను అనౌన్స్ చేశాడు.సంపత్ నంది ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా భారీ బడ్జెట్ తో కేకే రాధామోహన్ నిర్మించనున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు.త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























