గేమ్ ఛేంజర్ లోని నా పాత్ర కెరీర్ లో బెస్ట్ అవుతుంది – అంజలి

Actress Anjali Shares Her Experience For Game Changer Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Game Changer,Game Changer Movie,Game Changer Telugu Movie,Game Changer Update,Game Changer Movie Updates,Game Changer Movie Latest News,Game Changer Latest Update,Game Changer Songs,Game Changer Movie Songs,Game Changer Video Songs,Game Changer Trailer,Game Changer Teaser,Ram Charan,Shankar,Dil Raju,Actress Anjali,Anjali,Anjali Movies,Anjali New Movie,Anjali Latest Movie,Anjali Latest News,Anjali Interview,Anjali Latest Interview,Anjali Exclusive Interview,Actress Anjali About Game Changer Movie,Anjali About Game Changer,Actress Anjali Latest Exclusive Interview,Anjali Shares Her Experience For Game Changer,Anjali Interview On Game Changer,Actress Anjali Says Her Role Parvati

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ,స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించింది. ఈసందర్భంగా అంజలి మీడియా తో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతికి మీ రెండు చిత్రాలు వస్తున్నాయి? దాని గురించి చెప్పండి?

ఏ యాక్టర్‌కి అయినా సరే సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఆనందంగా ఉంటుంది. తెలుగులో గేమ్ చేంజర్, తమిళంలో విశాల్ చిత్రం రాబోతోంది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను.

గేమ్ చేంజర్‌లో మీ పాత్ర గురించి చెప్పండి?

గేమ్ చేంజర్‌లో పార్వతి అనే రోల్ చేశాను. మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ గారు కథ చెప్పినప్పుడు.. పాత్ర పేరు చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు. ఆ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెబుదామని అప్పటి నుంచీ వెయిట్ చేస్తూనే వచ్చాను. ఈ పాత్ర నా నుంచి చాలా డిమాండ్ చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను. శంకర్ గారు నా పర్ఫామెన్స్‌ను చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రం, బెస్ట్ రోల్ అవుతుంది.అలాగే సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.

మీ పాత్ర కోసం మీరు చేసుకున్న ప్రిపరేషన్స్ ఏంటి?

పార్వతి పాత్ర కోసం నేనేమీ ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదు. నా పాత్రలో సస్పెన్స్, ట్విస్ట్ ఉంటుందని శంకర్ గారు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇంకా నేను ఆ కారెక్టర్‌ గురించి ఎక్కువగా చెప్పకూడదు.అది థియేటర్‌లో ఆడియెన్స్ చూసినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సెట్స్ నుంచి వచ్చినా కూడా ఈ పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడుతూనే వచ్చింది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ కారెక్టర్.

మీ పాత్రకు నేషనల్ అవార్డు వస్తుందని అంతా అంటున్నారు?

నేను కూడా కథ విన్నప్పుడు అలానే అనుకున్నాను. నాక్కూడా అలానే అనిపించింది. అంతా అంటున్నట్టుగా అదే నిజమైతే అంతకంటే గొప్ప విషయం, సక్సెస్ ఇంకేం ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల అది నిజం కావాలి.

ఈ పాత్రను పోషించడంలో మీకు ఎదురైన సవాళ్లు ఏంటి?

బయటే జరిగే సంఘటనలు, ఎదురైన అనుభవాల నుంచే ఏ యాక్టర్ అయినా కూడా తెరపై నటించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ సినిమాలోని కారెక్టర్‌, ఆ బ్యాక్ డ్రాప్ చాలా కొత్తది. నాకు ఇలాంటి ఘటనలు, మనుషులు ఎప్పుడూ ఎదురు కాలేదు. చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఈ పాత్రను పోషించేందుకు, నటనతో ఆడియెన్స్‌ను నమ్మించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

అప్పన్న పాత్రతో మీ జర్నీ ఎలా ఉండబోతోంది?

శంకర్ గారు నా పాత్ర గురించి చాలానే చెప్పారు. నా పాత్రలో చాలా సోల్ ఉంటుంది. ఎక్కువగా రివీల్ చేయొద్దనే ట్రైలర్, టీజర్‌లో తక్కువ షాట్స్ పెట్టారు. నా పాత్రను తెరపై చూసినప్పుడు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. అప్పన్న, పార్వతీల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.

రామ్ చరణ్‌తో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది?

రామ్ చరణ్ గారు తన కో స్టార్స్‌కు కంఫ్టర్ట్ ఇస్తారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ చాలా కామ్‌గా ఉంటారు. సెట్స్‌లో అందరితోనూ బాగా ఉంటారు. అందరితోనూ చక్కగా మాట్లాడతారు. దిల్ రాజు గారి బ్యానర్, శంకర్ గారి సినిమా, రామ్ చరణ్ గారితో మొదటి సినిమా కావడంతో నాకు ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రత్యేకం. శంకర్ గారు, మణిరత్నం గారి చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. నాకు శంకర్ గారి చిత్రంలో ఛాన్స్ రావడం ఆనందంగా అనిపించింది.

గేమ్ చేంజర్ మీ లైఫ్‌కు గేమ్ చేంజర్ అవుతుందా?

గేమ్ చేంజర్ వల్ల నా ఆలోచనాధోరణి మారింది. ఈ ప్రయాణంలో ఎంతో మార్చుకున్నాను. ఇక నెక్ట్స్ ఎంచుకునే పాత్రలు, సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ విషయంలో నాకు గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారు సినిమా చూసి నా పాత్రను మెచ్చుకున్నారని తెలిసింది. అదే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది.

రామ్ చరణ్ గారితో మీరు చేసిన సాంగ్ గురించి చెప్పండి?

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అరుగు మీద అంటూ ఓ పాటను రిలీజ్ చేశాం. ఇప్పటికే ఈ పాట రీల్స్‌లో ట్రెండ్ అవుతోంది. నాకే కాకుండా టీం అందరికీ కూడా అది ఫేవరేట్ సాంగ్. అది ఎప్పటికీ నిలిచిపోయే పాట. తమన్ నాకు ఇచ్చిన బలుపు, వకీల్ సాబ్ ఇలా అన్ని పాటలు ఎవర్ లాస్టింగ్‌గానే ఉంటాయి. ఇప్పుడు ఈ పాట కూడా ఎవర్ లాస్టింగ్‌గా నిలుస్తుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ గురించి ?

దిల్ రాజు గారి నిర్మాణంలో నాకు ఎప్పుడూ గొప్ప చిత్రాలే వచ్చాయి. సీతమ్మ వాకిట్లో, వకీల్ సాబ్ ఇలా అన్నీ మంచి చిత్రాలే వచ్చాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతోంది. ఇది కూడా చాలా మంచి చిత్రం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నాకు హోం బ్యానర్ లాంటిది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.