తమిళ హీరో తల అజిత్ ,మార్క్ ఆంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమాతో మైత్రి తమిళం లోకిఎంట్రీ ఇస్తుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను చెప్పేశారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.ఆ డేట్ కు ప్రభాస్ ది రాజాసాబ్ రావాల్సివుంది. అయితే షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడే అవకాశాలు వున్నాయి.దాంతో మైత్రి గుడ్ బ్యాడ్ అగ్లీకి ఆ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఏప్రిల్ 10న జాట్ కూడా వస్తుంది.దీన్ని కూడా మైత్రినే నిర్మిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర కు కూడా ఇదే డేట్ అనుకుంటున్నారు. సిద్దు జొన్నలగడ్డ జాక్ కూడా ఇదే డేట్ కు రానుంది. దాంతో గుడ్ బ్యాడ్ అగ్లీ కి తెలుగులో పోటీ తప్పకపోవచ్చు.
పక్కా కమర్షియల్ ఎంటెర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సునీల్ ,ప్రేమలు హీరో నెల్సన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది.
ఇదిలా ఉంటే అజిత్ ఈ సంక్రాంతికి విడా ముయార్చి తో రావాల్సివుంది.అయితే ఈసినిమా రిలీజ్ వాయిదా వేశారు.మగిజ్ తిరుమనేని తెరకెక్కిస్తున్న ఈసినిమాలో అర్జున్ సర్జా ,త్రిష,ఆండ్రియా జెర్మియా, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.సో ఈ ఈఏడాది అజిత్ రెండు సినిమాలతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: