సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సాంగ్స్ , ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపు అంచనాలు భారీగా వున్నాయ్.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు అనంతపురం లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపాలనుకున్నారు. అయితే నిన్న దురదృష్టవశాత్తు తిరుపతి లో తొక్కిసలాట లో జరగడం తో ఈవెంట్ ను నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే సినిమా రిలీజ్ కానుంది.అయితే రీసెంట్ గా యూఎస్ ఏ లో ఈసినిమా ఈవెంట్ జరిపారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈసినిమాలో బాలకృష్ణ ను ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా చూపించనున్నాడు బాబీ.ఇందులో శ్రద్దా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ,చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందించగా నాగవంశీ, సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
ఇక మరోవైపు హ్యాట్రిక్ సక్సెస్ లతో ప్రస్తుతం కెరీర్ లో పీక్ ఫామ్ లో వున్నాడు బాలకృష్ణ.మరి సంక్రాంతికి భారీ అంచనాలతో వస్తున్న ఈ డాకు మహారాజ్ తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: