కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య తన 44వ సినిమా రెట్రో తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.మే 1న విడుదలకానుంది.అయితే అదే డేట్ కు లోకేష్ కనగరాజ్ ,సూపర్ స్టార్ రజినీకాంత్ ల కూలీ దింపాలనుకున్నారు కానీ ఈసినిమా ఆగస్టు కు షిఫ్ట్ కావడంతో రిట్రో ఆ డేట్ ను లాక్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తీక్ సుబ్బరాజు ఈసినిమాను తెరకెక్కిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.ఈసినిమా పై సూర్య ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇక సూర్య ప్రస్తుతం తన 45వ సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.జూన్ లోగా షూటింగ్ కంప్లీట్ చేసి ఏడాది చివర్లో థియేటర్లలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.సో ఈ ఏడాది సూర్య రెండు సినిమాలతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. మరి ఈసినిమాలు తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: