ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజై నెల దాటుతున్న ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.రీసెంట్ గా దేవర తరువాత మంచి లాంగ్ రన్ ను కనబరుస్తున్న సినిమా పుష్ప 2.ఇక ప్రేక్షకులను మరోసారి థియేటర్లలోకి రప్పించడానికి మేకర్స్ మరో 20 నిమిషాలను సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ న్యూ వెర్షన్ ను ఈనెల 11న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సాంకేతిక సమస్యల వల్ల వాయిదా వేశారు.ఈనెల 17న రీ లోడెడ్ వెర్షన్ రిలీజ్ కానుంది. దాంతో పుష్ప 2 ఈ సంక్రాంతికి నెమ్మదించి ఆతరువాత మళ్ళీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా బాహుబలి 2 వసూళ్లను దాటేసి ఇండియాలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా చరిత్ర సృష్టించింది.అటు హిందీ లో హైయెస్ట్ గ్రాసర్ గా ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.నిన్నటి తో కలిపి అక్కడ 810కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది. ఓవరాల్ గా చూస్తే 1830 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈనెల చివర్లో కానీ లేదా వచ్చే నెల మొదటి వారం లోకాని పుష్ప 2 ఓటిటి లోకి వచ్చే ఛాన్స్ వుంది.
రిలీజ్ కు ముందు ఎంత సెన్సేషన్ సృష్టించిందో ఈసినిమా రిలీజ్ అయ్యాక రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో రచ్చ లేపింది. అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటించిన ఈసినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: