విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి,బడా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఈ సంక్రాంతికి విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా అవ్వగా నిన్న ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు.ఇందుకోసం నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.ఈ గ్రాండ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం అభిమానులు ఉర్రూతలూగించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. నిజామాబాద్ లో ట్రైలర్ లాంచ్ జరగడం చాలా హ్యాపీగా వుంది. మీ లవ్ అండ్ సపోర్ట్ కి థాంక్ యూ. నాకు ఎన్నో హిట్లు ఇచ్చారు. బొబ్బిలిరాజా, చంటి, గణేష్ , సీతమ్మ వాకిట్లో, ఎఫ్ 2, ఎఫ్ 3 ఇలా ఎన్నో విజయాలు ఇచ్చారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో వస్తున్నాం. సంక్రాంతి సినిమా ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలి. తప్పకుండా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అఫ్ ఎంటర్ టైన్మెంట్, సాంగ్స్.. ఇలా అనిల్ హోల్సం ఎంటర్ టైనర్ ని ఇచ్చారు. మీ అందరికీ నచ్చుతుంది. మీ అభిమానం సంక్రాంతికి చూపిస్తారు. ఈ సినిమాలో పాటు గేమ్ చెంజర్ డాకు మహారాజ్ అన్నీ పెద్ద హిట్లు కావాలని కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు బ్యానర్ లో చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. దిల్ రాజు, శిరీష్ గారితో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. అనిల్ థాంక్ యూ వెరీ మచ్. ఐశ్వర్య, మీనాక్షి చాలా అద్భుతంగా పెర్ఫారం చేశారు. పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు. సినిమా చూడండి. మామూలుగా వుండదు. అందరికీ థాంక్ యూ అని అన్నారు.
టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిజామాబాద్ లో ఇంతకు ముందు ఫిదా వేడుక చేశాం.అనిల్ నిజామాబాద్ లో వేడుక చేద్దామని అన్నారు. వెంకటేష్ గారు అనిల్ శిరీష్ వారి భుజాన వేసుకొని 72 రోజుల్లో ఇంత పెద్ద సినిమాని ఫినిష్ చేశారు. పూర్తిస్థాయిలో ఓ సినిమా వేడుక నిజామాబాద్ లో జరగడం ఇదే ఫస్ట్ టైం. సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.1980లో ఇక్కడ రూపాయి టికెట్ తో నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం. అలా సినిమాలపై ఇష్టం ఏర్పడింది. మా 58వ సినిమా ఈవెంట్ ఇక్కడ చేయడం మాకు చాలా గర్వంగా వుంది. ఎంతోమంది హీరోలు, దర్శకులు సపోర్ట్ చేస్తే ఈ స్థాయిలో వున్నాం. అనిల్ మా బ్యానర్ లో ఆరు సినిమాలు చేసి ఒక పిల్లర్ లా నిలబడ్డారు. తను ఒకొక్కమెట్టు ఎదుగుతూ టాప్ డైరెక్టర్ గా అయ్యారు. ఈ ఏడాది మా సంస్థకు బ్లాక్ బస్టర్ పొంగల్ ఇయర్. పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ 10న రిలీజ్ అవుతుంది. మా బ్యానర్ లో ఎఫ్ 2 ఎఫ్ 3 లాంటి సూపర్ హిట్స్ చేసిన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తున్నాం సినిమా జనవరి 14న వస్తోంది. అలాగే డాకు మహారాజ్ ని నైజంలో మేము రిలీజ్ చేస్తున్నాం. అందుకే ఇది మాకు బ్లాక్ బస్టర్ పొంగల్. ఐశ్వర్య రాజేష్ సహజంగా నటించింది. ఆ పాత్ర చాలా నచ్చుతుంది. మీనాక్షి పోలీస్ క్యారెక్టర్ అలరిస్తుంది. రామానాయుడు గారు నిర్మాతగా చరిత్ర సృష్టించారు. వెంకటేష్ గారి కలియుగ పాండవులు ఫోటో చూసి ఆయనకి ఫ్యాన్ అయ్యాను. సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యాను. వారిద్దరూ నా అభిమాన హీరోలు. వెంకటేష్ గారు వుంటే నిర్మాత సెట్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయనే అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. మా బ్యానర్ లో నాలుగు సినిమాలు చేసిన హీరో వెంకటేష్ గారు. నిర్మాతని ప్రేమగా చూసుకునే హీరో ఆయన. వెంకటేష్ గారికి థాంక్ యూ సో మచ్. అనిల్ అద్భుతంగా సినిమా తీశాడు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్. పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అన్నీ పేర్చుకొని సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తీసుకురాబోతున్నాడు అనిల్. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ వెరీ మచ్ అని అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ అందరూ చూశారు. ట్రైలర్ లో చూసింది ఇంతే సినిమాలో చాలా చాలా వుంది. ఇది టిపికల్ జోనర్ సినిమా. వెంకటేష్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సినిమాలో చాలా ట్విస్ట్ లు టర్న్స్ వుంటాయి. ఖచ్చితంగా పండక్కి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. దిల్ రాజు గారి బ్యానర్ లో ఇది నా ఆరో సినిమా. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరూ సపోర్ట్ గా నిలుచారు. ఐస్వర్య, మీనాక్షి చాలా చక్కగా నటించారు. వెంకటేష్ గారు మనందరికీ నచ్చే వెంకీ మామ. ఆయన కెరీర్ లో చాలా గొప్ప పాత్రలు చేశారు. ఆయన కెరీర్ లో ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. వెంకటేష్ గారు ప్రాణం పెట్టి పని చేస్తారు. ప్రమోషన్స్ లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయనకు థాంక్ యూ. మా టీం అందరికీ థాంక్ యూ. థాంక్ యూ నిజామాబాద్. సంక్రాంతికి మీ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకొని థియేటర్స్ కి వచ్చేయండి. కడుపుబ్బా నవ్వించి బయటికి పంపుతాం అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: