యంగ్ హీరో అడవి శేష్ నుండి నెక్స్ట్ వస్తున్న స్పై థ్రిల్లర్ G2.ఇది సూపర్ హిట్ మూవీ గూడచారికి సీక్వెల్ గా వస్తుంది.వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్ లో పాన్-ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈసినిమా లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రలో నటిస్తున్నాడు.ఇక హిందీ నటి వామికా గబ్బి కూడా ఈసినిమా లో జాయిన్ అయ్యింది. వామికా,అడివి శేష్ సరసన లీడ్‌గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం యూరప్ లో ఓ షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో అడివి శేష్ తోపాటు వామికా కూడా పాల్గొంటుంది. ఈచిత్రం గురించి వామికా స్పందించింది. G2 అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.మొదటి చిత్రం చెప్పుకోదగ్గ బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది ,ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఆనందంగా వుంది. ప్రతిభావంతులైన తారాగణం, టీంతో కలిసి పనిచేయడం నాకు స్ఫూర్తినిస్తుంది అని ఆమె అన్నారు.
అడివి శేష్, వామికా గబ్బి,ఇమ్రాన్ హష్మీ తో పాటు మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు షాలిని కీలక పాత్రలు పోషిస్తున్న ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ,ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై టి జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.సమ్మర్ లో ఈసినిమా విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఈనెలలో ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: