
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 58


చిరు-చరణ్ పై సోనూసూద్ ప్రశంసలు

మాస్క్ ధరించడంపై సినీ తారల వీడియో

షూటింగ్ కు అనుష్క రెడీ !

ఖిలాడి రీమేక్ కాదు..!

సమంత సోషల్ మీడియా రికార్డ్

రీతూ వర్మ స్ట్రాటజీ

మోడలింగ్ డేస్ లో సోనూసూద్

అభిమానులకు 'బాలయ్య' రిక్వెస్ట్

ఆత్మ విశ్వాసమే అసలైన అందం -సాయి పల్లవి

ముగింపు దశలో "మేజర్ "

'ఫలక్ నుమా దాస్ 2' అనౌన్స్ చేసిన విశ్వక్

నాని చేతుల మీదుగా '777 చార్లి' టీజర్ రిలీజ్

జూలై లో "విరాటపర్వం" రిలీజ్ ?

ఆగస్ట్ లో సెట్స్ పైకి "#PSPK 28 "

అనసూయ స్టన్నింగ్ లుక్

ఏక్ మినీ కథ హీరోతో మారుతి సినిమా
ఏక్ మినీ కథ సినిమా హిట్ తో ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు సంతోష్ శోభన్ . ఇప్పటికే పలు పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు కమిట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు. ప్రేమ్ కుమార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

చిరు-చరణ్ పై సోనూసూద్ ప్రశంసలు
ఎంతోమంది కరోనా బాధితులకు తనవంతూ సహకారం అందిస్తూ.. సాయం అడిగిన వారికి కాదనకుండా నేటి కర్ణుడిలా తయారయ్యాడు సోనూసూద్. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ప్రజల్లో దేవుడిగా మారిపోయారు. ఇక సెకండ్ వేవ్ లో చాలా మంది ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఎంతోమందికి ఆక్సిజన్ అందిస్తూ.. అవసరమైన ట్రీట్మెంట్ చేయిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. అలాంటి సోనూ సూద్ తాజాగా చిరంజీవి, రామ్ చరణ్‌లపై ప్రశంసలు కురిపించారు.

మాస్క్ ధరించడంపై సినీ తారల వీడియో
కరోనా ఫస్ట్ వేవ్ లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం తో లక్షలాది కేసులు , వేలాది మరణాలు సంభవించాయి. కరోనా వ్యాప్తి నివారణ కై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ , కర్ఫ్యూ , మాస్క్ ధరించడం , సోషల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయడం వంటి చర్యలు చేపట్టాయి. సినీ సెలబ్రిటీస్ తమ వంతు సాయంగా ప్రజలకు కరోనా పై జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. అయినా కొంతమంది ఏమీ పట్టనట్టుగా కేర్ లెస్ గా ఉంటూ , మాస్క్ ను సక్రమంగా ధరించకుండా కరోనా వ్యాప్తి కి కారణం అవుతున్నారు.

షూటింగ్ కు అనుష్క రెడీ !
“సూపర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అనుష్క ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్"అరుంధతి " , "బాహుబలి ", బాహుబలి 2", "రుద్రమ దేవి ", "భాగమతి" వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క క్రేజీ హీరోయిన్ గా మారారు. పలు మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

ఖిలాడి రీమేక్ కాదు..!
ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా కూడా వాయిదా పడింది.

సమంత సోషల్ మీడియా రికార్డ్
ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత పదేళ్లలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాదు.. హోస్ట్ గా కూడా మారింది. సేవా కార్యక్రమాలు ఎలాగూ చేస్తూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ 2 తో వెబ్ సిరీస్ తో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా అడుగుపెట్టింది. ఈసిరీస్ లో సమంత నటనకు గాను మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా సమంత మంచిగా యాక్టీవ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా క్వీన్ గా కూడా సమంతకు పేరుంది. కేవలం సినిమాలకు సంబంధించే కాదు చాలా విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుపుతుంది సమంత. ఇక తాజాాగా సోషల్ మీడియాలో మరో…

'కె.జి.యఫ్ 2' ఎప్పుడు రిలీజ్ అవుతుందో మ్యాటర్ కాదు..!
ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా అని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2 పై కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది. జులై 16న సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.. మరి అప్పటికీ పరిస్థితులు నార్మల్ గానే ఉంటే చెప్పిన డేట్ కే రిలీజ్ చేసే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వస్తున్న సంగతి తెలిసిందే.

సినీ కార్మికులకు వ్యాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం : మెగాస్టార్ చిరంజీవి
కోరనా వల్ల సినీ పరిశ్రమకు మాత్రం చాలా నష్టమే జరిగింది. షూటింగ్ లు లేకపోవడం.. థియేటర్లు మూత పడటం.. బిజినెస్ ఆగిపోవడం వల్ల కొన్నివేల కోట్లలో నష్టం వచ్చింది.పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఎంతో మంది సినీ కార్మికులు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వారికోసం ఎంతో మంది సినీ పెద్దలు ముందుకొచ్చి నిత్యవసరాలు అందించారు. ఆర్థికంగా సహాయ పడ్డారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయపడ్డారు. ఇక ఇప్పుడు ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో…

రీతూ వర్మ స్ట్రాటజీ
సూపర్ హిట్ "బాద్ షా" మూవీ తో నటిగా కెరీర్ ప్రారంభించిన రీతూవర్మ సక్సెస్ ఫుల్ "ప్రేమ ఇష్క్ కాదల్" మూవీ తో కథానాయికగా మారారు.బ్లాక్ బస్టర్ "పెళ్ళిచూపులు " మూవీ లో రీతువర్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కొన్ని తమిళ మూవీస్ లో రీతూవర్మ నటించారు. రీతూవర్మ కథానాయికగా రూపొందిన "టక్ జగదీష్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మోడలింగ్ డేస్ లో సోనూసూద్
1997 సంవత్సరం లో ముంబై చేరుకొని మోడలింగ్ చేసిన సోనూ సూద్ "కలైంజర్ " (1999) తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 'హ్యాండ్స్ అప్ "(2000) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "షహీద్ ఈ అజాం "మూవీ తో బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సోనూసూద్ విలన్ , కామెడీ విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోనూసూద్ బ్లాక్ బస్టర్ “అరుంధతి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “తమిళరసన్ “(తమిళ ), “పృథ్విరాజ్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

అభిమానులకు 'బాలయ్య' రిక్వెస్ట్
జూన్ 10వ తేదీన నందమూరి బాలయ్య పుట్టిన రోజు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అభిమానులు ఈరోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కరోనా వల్ల గత ఏడాది తమ అభిమానులకు పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉండమని ఎలా చెబుతున్నారో.. ఈఏడాది కూడా అలాగే తమ అభిమానులను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా బాలకృష్ణ కూడా సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

ఆత్మ విశ్వాసమే అసలైన అందం -సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు.

ముగింపు దశలో "మేజర్ "
సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న అడివి శేష్ కథానాయకుడిగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “జూలై 2 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించారు.

'ఫలక్ నుమా దాస్ 2' అనౌన్స్ చేసిన విశ్వక్
ఫలక్ నుమా దాస్ సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ కేవలం హీరోగా మాత్రమే కాదు దర్శక నిర్మాతగా మారి ఈసినిమాను తెరకెక్కించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ ను తెలుగులో ఫలక్ నుమా దాస్ పేరుతో రీమేక్ చేశాడు. 2019 మే 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈసినిమాలో పక్కా హైద్రాబాదీ ఎట్మాస్ఫియర్ తో పాటు తెలంగాణ స్లాంగ్ ను వాడుకున్నాడు విశ్వక్ సేన్. ఇక ఈసినిమా హిట్ అవ్వడమే కాదు మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది.

నాని చేతుల మీదుగా '777 చార్లి' టీజర్ రిలీజ్
పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు వేరే భాషల్లోకి డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కె.జి.యఫ్ సినిమా ఎఫెక్ట్ తో ఇక కన్నడ సినిమాలు కూడా ఈమధ్య తెలుగులోకి రిలీజ్ అవుతున్నాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. కన్నడలో స్టార్ హీరోగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఇప్పటికే కిరిక్ పార్టీ, 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు రక్షిత్ శెట్టి.

జూలై లో "విరాటపర్వం" రిలీజ్ ?
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన “విరాటపర్వం “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. 90 ల నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రూపొందిన ఈ పీరియాడిక్ సోషల్ డ్రామా “విరాటపర్వం “మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన 'గుడ్ లక్ సఖి' మేకర్స్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు లేకపోవడంతో చిన్న సినిమాలు దాదాపు ఓటీటీలో రిలీజ్ కే చూస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం కాస్త లేట్ అయినా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అవుతున్నారు. ఈనేపథ్యంలో ఇక ‘గుడ్ లక్ సఖి’ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఆగస్ట్ లో సెట్స్ పైకి "#PSPK 28 "
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “, మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ దర్శకత్వంలో "#PSPK 28 " మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన“గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

'ప్రశాంత్ నీల్' కు ప్రభాస్, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్
నేడు కె.జి.యఫ్ డైరెక్టర్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అంతేకాదు కె.జియఫ్, సలారా నిర్మాణ సంస్థ అయిన హోంబలె ఫిలిమ్స్ ఒక ట్రిబ్యూట్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. అందులో ప్రశాంత్ నీల్ గురించి బాగానే ఎలివేషన్ ఇచ్చారు.

అనసూయ స్టన్నింగ్ లుక్
తన అద్భుతమైన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం“పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.