ఖిలాడి రీమేక్ కాదు..!

Director Ramesh Varma Gives Clarity That His Upcoming Movie Khiladi Is Not A Remake ,Director Ramesh Varma Reveals Details About The Ravi Teja Starrer Khiladi Movie, Khiladi, Khiladi Movie, Khiladi Movie Shooting Updates, Khiladi Movie Updates, Khiladi Telugu Movie, Khiladi Telugu Movie Latest News, Khiladi Telugu Movie Shooting Latest News, latest telugu movies news, Latest Tollywood News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజర్‌కి మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. అయితే ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా కూడా వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా త‌మిళంలో అర‌వింద్ స్వామి, త్రిష జంట‌గా న‌టించిన శ‌తురంగ వేట్టై-2 ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కిన‌ట్లు వార్త‌లొచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ర‌మేష్ వ‌ర్మ తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చాడు. ఖిలాడి రీమేక్ కాద‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు. కాకపోతే స్టోరీ లైన్ ప‌రంగా ఓ త‌మిళ సినిమాతో దీనికి పోలిక ఉంటుంద‌ని చెప్పాడు. అంతేకాదు ఆసినిమా దర్శక నిర్మాతలతో కూడా ఇప్పటికే మాట్లాడం.. మాట్లాడిన త‌ర్వాతే సినిమాను మొద‌లుపెట్టామ‌ని ర‌మేష్ తెలిపాడు.

కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫ‌ర్’ ఫేమ్ సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 11 =