
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 15


ఖుషి-త్వరలో షూటింగ్ రీస్టార్ట్

నాని దసరా టీజర్ రిలీజ్

టైగర్ నాగేశ్వరరావు లో రవితేజ డిఫరెంట్ లుక్స్

#NTR 30 మూవీ కై హైదరాబాద్ లో సముద్రం సెట్

చంద్ర ముఖి 2 మూవీ స్పెషల్ అప్ డేట్

మైఖేల్ కోసం న్యాచురల్ స్టార్

మా తారకరత్న అన్నకి మేమున్నాం - ఎన్టీఆర్

#NTR30 మూవీ కై భారీ సెట్స్

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు

సలార్ మూవీ లో అతిథి పాత్రలో రాఖీ భాయ్ ?

వెంకీ 75 గ్లింప్స్ రిలీజ్

వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ అప్ డేట్

వెంకీ 75 గ్లింప్స్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

కబ్జా రిలీజ్ డేట్ ఫిక్స్

కీడా కోలా- బ్రహ్మానందం క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈసినిమాను రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ చిత్రంలో ఎనిమిది ప్రధాన పాత్రలు ఉన్నాయి. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

అమిగోస్- ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ రిలీజ్
కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. అందులో అమిగోస్ సినిమా కూడా ఒకటి. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు.

ఖుషి-త్వరలో షూటింగ్ రీస్టార్ట్
శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మహానటి తర్వాత విజయ్‌దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్నసినిమా ఇది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో సమంత వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. అందులోనూ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈనేపథ్యంలో మధ్యలో పలు రూమర్స్ కూడా తెరపైకి వచ్చాయి. ఈసినిమాలో సమంత…

నాని దసరా టీజర్ రిలీజ్
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఇంత వరకు చేయక పోవడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి మరింత హైప్ పెంచడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి పాటలు, పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు…

టైగర్ నాగేశ్వరరావు లో రవితేజ డిఫరెంట్ లుక్స్
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మిగిలిన సినిమాల పెండింగ్ షూటింగ్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చాయి. తాాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ లలో కనిపించనున్నాడట. స్టైలిష్, రగ్డ్, యంగ్…

#NTR 30 మూవీ కై హైదరాబాద్ లో సముద్రం సెట్
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అమిగోస్ మూవీ గురించి హీరోయిన్ ఆషికా రంగనాథ్ ముచ్చట్లు
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ జంటగా తెరకెక్కుతున్న అమిగోస్ మూవీ ఫిబ్రవరి 17, 2023 న రిలీజ్ కానుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందింస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించనున్న కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చంద్ర ముఖి 2 మూవీ స్పెషల్ అప్ డేట్
శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. లెజెండరీ కమెడియన్ వడివేలు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మైఖేల్ కోసం న్యాచురల్ స్టార్
రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్. ఈసినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈసినిమాతో సందీప్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. దీనికోసం డేట్ ను వేదికను…

మా తారకరత్న అన్నకి మేమున్నాం - ఎన్టీఆర్
యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడకు చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా, అభిమానులతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు వెల్లడించారు. తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని.. ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎన్టీఆర్ చెప్పారు.

#NTR30 మూవీ కై భారీ సెట్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, హాలీవుడ్ డైరెక్టర్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సలార్ మూవీ లో అతిథి పాత్రలో రాఖీ భాయ్ ?
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు…

వెంకీ 75 గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో అలరించాడు వెంకీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా చేసేస్తున్నాడు. రానాతో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్ సిరీస్‌ను చేస్తున్నారు. ఈసిరీస్ లో డిఫరెంట్ మేకోవర్ తో అలరిస్తున్నాడు వెంకీ. విడుదలకు రెడీ అయిన ఈ వెబ్ సిరీస్ నుంచి ఇటీవల టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 75వ సినిమాను సిద్దం చేస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రెండు రోజుల క్రితమే ఇచ్చారు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో…

వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ అప్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను…

ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ ఎంట్రీ పై చిరంజీవి , బాలకృష్ణ స్పందన
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, హాలీవుడ్ డైరెక్టర్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆస్కార్ నామినేషన్ లో నాటు నాటు సాంగ్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజుల పాత్రలతో ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమా ఇక్కడ ఎంత విజయం అందించిందో తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో మెట్టు ఎక్కి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించాడు. ఈసినిమా ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు, సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా, న్యూయార్క్ ఫిలిం…

వెంకీ 75 గ్లింప్స్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తుంది ఆయన మైల్ స్టోన్ సినిమా గురించి. ఆయన 75వ సినిమా కోసం ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఊరటనిస్తూ ఈసినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ నిన్న వచ్చిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు పూర్తి వివరాలు రేపు రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు. ఈనేపథ్యంలో తాజాగా ఈ గ్లింప్స్ కు రిలీజ్ టైమ్ ను కూడా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. వెంకీ 75 వ గ్లింప్స్ ను రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వారు పోస్టర్ రిలీజ్ చేశారు.

కబ్జా రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ఉంటాడు ఉపేంద్ర. తను చేసే సినిమాలు రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టే తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

రిలీజ్ అయిన శివరాజ్ కుమార్ వేద మూవీ ఫస్ట్ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో శివరాజ్ కుమార్ రీసెంట్ గా సూపర్ హిట్ వేదం మూవీ తో ప్రేక్షకులను అలరించారు. జీ స్టూడియోస్, గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్స్ పై ఎ. హర్ష దర్శకత్వం లో శివరాజ్ కుమార్ , ఘనవి లక్ష్మణ్ జంటగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా వేద కన్నడ మూవీ 2022 డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శివరాజ్ కుమార్ 125 వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ లో అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ ముఖ్య పాత్రలలో నటించారు. అర్జున్ జన్య సంగీతం అందించారు.