సలార్ మూవీ లో అతిథి పాత్రలో రాఖీ భాయ్ ?

Yash to Play Cameo in Prabhas Salaar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Telugu Movie Latest News,Prabhas,Yash,Yash to Play Cameo in Prabhas Salaar,Yash to Play Cameo in Prabhas Salaar Telugu Movie

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ సీక్వెల్ కె.జి.యఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కె.జి.యఫ్ చాప్టర్ 1, కె.జి.యఫ్ చాప్టర్ 2 మూవీస్ లో రాఖీ భాయ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. సలార్ మూవీలో హీరో యష్ అతిథి పాత్రలో నటించనున్నారనీ.. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్, యష్ ను సంప్రదించినట్టు.. దానికి యష్ ఓకే చేసినట్టు సమాచారం. ఇద్దరు పాన్ ఇండియా హీరోలు ప్రభాస్, యష్ స్క్రీన్ షేర్ చేసుకుంటే అభిమానులకు పండగే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − ten =