కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కబ్జా రిలీజ్ డేట్ ఫిక్స్

Kabzaa Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Kabzaa,Kabzaa Movie,Kabzaa Telugu Movie,Kabzaa Movie Updates,Kabzaa Telugu Movie Latest News,Kabzaa Release

కబ్జా రిలీజ్ డేట్ ఫిక్స్

Kabzaa Movie Release Date Fixed

Kabzaa Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Kabzaa,Kabzaa Movie,Kabzaa Telugu Movie,Kabzaa Movie Updates,Kabzaa Telugu Movie Latest News,Kabzaa Release

కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ఉంటాడు ఉపేంద్ర. తను చేసే సినిమాలు రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టే తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

ఇక ఈసినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు తాజాగా గుడ్ న్యూస్ అందించింది చిత్రయూనిట్. ఈసినిమాను మార్చి 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కన్నడ భాషలతో పాటు పాన్ ఇండియన్ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. మరి ప్రస్తుతం కన్నడ సినిమాలు మంచి హిట్లను అందుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం ఈసినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో..

కాగా ఈసినిమాలో మరో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా నటిస్తున్నాడు. ఇంకా శ్రియా శరణ్, బొమన్ ఇరానీ, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠి, బెంగాలీ మొత్తం ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్