పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో శివరాజ్ కుమార్ రీసెంట్ గా సూపర్ హిట్ వేదం మూవీ తో ప్రేక్షకులను అలరించారు. జీ స్టూడియోస్, గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్స్ పై ఎ. హర్ష దర్శకత్వం లో శివరాజ్ కుమార్ , ఘనవి లక్ష్మణ్ జంటగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా వేద కన్నడ మూవీ 2022 డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శివరాజ్ కుమార్ 125 వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ లో అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ ముఖ్య పాత్రలలో నటించారు. అర్జున్ జన్య సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్‌లో వేద చిత్రం మొదటి వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగు వెర్షన్ లోనూ రిలీజ్ కు సిద్దం అవుతుండటం విశేషం. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా చిత్ర బృందం ఆవిష్కరించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లోని శివరాజ్ కుమార్ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చుట్టూ జనాల మధ్య కూర్చిలో కూర్చున్న శివరాజ్ కుమార్ స్టిల్ ఆసక్తిని కలిగిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: