స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, హాలీవుడ్ డైరెక్టర్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్నవిషయం తెలిసిందే. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు స్పందించారు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ స్పందించారు. కోట్లాదిమంది ఆకాంక్ష, కోరిక మార్చి 12 వ తేదీ ఫలించాలని కోరుకుంటున్నాననీ.. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డుకి ఎంపిక కావడం గొప్ప ఆనందాన్ని కలిగించిందనీ.. చిత్ర బృందానికి తన అభినందనలనీ.. అలాగే దీనితో పాటుగా ఇతర విభాగాల్లో భారత్ నుంచి ఎంపిక అయ్యిన ఆల్ దట్ బ్రేత్స్ మరియు ది ఎలిఫెంట్ విసృర్స్ టీం లకి కూడా తన అభినందనలు అంటూ బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: