దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజుల పాత్రలతో ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమా ఇక్కడ ఎంత విజయం అందించిందో తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో మెట్టు ఎక్కి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించాడు. ఈసినిమా ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు, సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ ఇక రీసెంట్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. వీటితో పాటు ఇంకా పలు అవార్డులు దక్కాయి. ఒక్క తెలుగు సినిమాకు ఇన్ని అంతర్జాతీయ అవార్డులు రావడం అనేది మాములు విషయం కాదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో రికార్డును క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు తాజాగా ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ టాప్ 4లో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగాల్లో ఈ సినిమా నామినేట్ అవుతుందని అనుకున్నారు కానీ అది జరగలేదు.
WE CREATED HISTORY!! 🇮🇳
Proud and privileged to share that #NaatuNaatu has been nominated for Best Original Song at the 95th Academy Awards. #Oscars #RRRMovie pic.twitter.com/qzWBiotjSe
— RRR Movie (@RRRMovie) January 24, 2023
కాగా ఈసినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.