కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ అప్ డేట్

Waltair Veerayya Grand Success Meet on 28th January 2023,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veer

వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ అప్ డేట్

waltair veerayya grand success meet on 28th January 2023

Waltair Veerayya Grand Success Meet on 28th January 2023,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veer

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా, అద్భుత సాంగ్స్ తో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వాల్తేరు వీరయ్య మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ.. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వాల్తేరు వీరయ్య మూవీ 10 రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరి, ప్రాఫిట్స్ తో దూసుకుపోతోంది. వాల్తేరు వీరయ్య గ్రాండ్ సక్సెస్ మీట్ జనవరి 28 వ తేదీ వరంగల్ లో జరగనుందనీ.. ఈ వేడుకకు ఐటి మినిస్టర్ కెటిఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులు గా పాల్గొంటారనీ సమాచారం.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్