ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 135
మై క్యూటీ హ్యాపీ బర్త్ డే
ముఖ్యమంత్రి జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు
సీటీమార్ షూటింగ్ పై సంపత్ నంది క్లారిటీ
పాయల్ కరోనా టెస్టింగ్ కష్టాలు
ఛాలెంజింగ్ రోల్ లో సమంత
సోనూసూద్ కు ప్రకాష్ రాజ్ సత్కారం
బాలకృష్ణ కు జోడీగా జయప్రద ?
ఫుల్ కామెడీ తో ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్
సుక్కూ - విజయ్ క్రేజీ కాంబినేషన్ కన్ఫామ్
రైటర్ గా మారిన రజినీ..!
పాకిస్థానీ టెర్రరిస్ట్ గా సమంత ..?
సోషల్ మీడియాలో ప్రభాస్ మరో రికార్డ్
బాలు విషయంలో నేషనల్ మీడియాపై హరీష్ కౌంటర్
బాలుకు నయన్ నివాళి..నమ్మడానికి కష్టంగా ఉంది
మరోసారి పొలిటీషియన్ పాత్రలో హీరో సూర్య
చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్లాస్మా వితరణ
అభిమానుల హృదయాలలో మెగా స్టార్ గా చెరగని ముద్ర వేసుకున్న చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో చిరంజీవి పేద సినీ కార్మికులకై కరోనా క్రైసిస్ చారిటీ సంస్థను నెలకొల్పి తోటి నటీనటుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్నారు. సైబరాబాద్ సి పి సజ్జనార్ ప్రారంభించిన ప్లాస్మా డొనేషన్ కార్యక్రమానికి చిరంజీవి చేయూత నందించారు.
నేషనల్ - ఇంటెర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న అనుష్క
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నిశ్శబ్దం సినిమా ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్స్,ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన మాధవన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
బిగ్ బాస్ 4 - నాలుగో వారం నామినేషన్ లిస్ట్
బిగ్ బాస్ మూడు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇక సోమవారం అంటే నామినేషన్ డే. ఈ డే కోసం హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఏం టాస్క్ ఇస్తారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చూస్తుంటారు. మరి 22 రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో.. ఎవరు నామినేషన్ లోకి వచ్చారో చూద్దాం.
మై క్యూటీ హ్యాపీ బర్త్ డే
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఇక టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో బన్నీ-స్నేహా రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తూనే వుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు.
ఎన్టీఆర్ - విజయవాడ యూనిక్ రికార్డ్
సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అతనే విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. పౌరాణిక చిత్రాల్లో అయితే ఆయన కృష్ణుడి వేషం వేస్తే ఆయనే కృష్ణుడు.. రాముడు వేషం వేస్తే రాముడు.. రావణుడు అయితే రావణుడు.. అర్జునుడు, శివుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.. ఏ పాత్ర అయినా అది ఆయన కోసమే పుట్టినట్టు ఉంటుంది. నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా...రాజకీయ వేత్తగా....ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను…
ముఖ్యమంత్రి జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు
కోట్లాది ప్రజలను తన గాన మాధుర్యంతో ఆకట్టుకున్న లెజెండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం కు భారత దేశ అత్యున్నత "భారత రత్న "పురస్కారం అందజేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , భారత ప్రధాని నరేంద్ర మోదీ కి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. బాలు కు భారతరత్న పురస్కారం పై విజ్ఞప్తి చేసిన జగన్ కు తమిళ సూపర్ స్టార్ , మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తన మద్దతు తెలిపారు.
సీటీమార్ షూటింగ్ పై సంపత్ నంది క్లారిటీ
హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
పాయల్ కరోనా టెస్టింగ్ కష్టాలు
కరోనా పరీక్షకు గాను ముక్కు నుండి శాంపిల్ సేకరిస్తారనే విషయం తెల్సిందే కదా. ఇక ఈ టెస్ట్ కోసం ఒక హీరోయిన్ భయంతో వణికిపోయినట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ పలు సినిమాలతో బిజీగా వుంది. ఇక షూటింగ్ లు మొదలవుతున్నాయి కాబట్టి పాయల్ కూడా షూటింగ్స్ లో పాల్గొనడానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఒక సినిమా షూటింగ్ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ముందస్తు జాగ్రత్తగా యూనిట్ సభ్యులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించారు. అలా పాయల్ కు కూడా కరోనా టెస్ట్ చేశారు. కరోనా నిర్థారణ పరీక్షకు సంబంధించిన వీడియోను పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఛాలెంజింగ్ రోల్ లో సమంత
తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లోన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రయోగాత్మక చిత్రాలపై ఆసక్తి చూపుతూ సమంత ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 "వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ లో నటించిన సమంత ఇప్పుడు తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ నేపథ్య మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సోనూసూద్ కు ప్రకాష్ రాజ్ సత్కారం
ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ ఎవరంటే సోనూసూద్. కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చడం దగ్గర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు. కొంతమంది అయితే ఆయన్ని దేవుడితో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
బాలకృష్ణ కు జోడీగా జయప్రద ?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఆ రెండు క్యారెక్టర్స్ లో ఒకటి అఘోరా పాత్ర. ఆపాత్ర "BB3 " మూవీకి హైలైట్ కానుందని సమాచారం. సూపర్ హిట్ కాంబినేషన్ లో బాలకృష్ణ 106 వ మూవీ గా రూపొందుతున్న "BB3 " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కి పలు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
ఫుల్ కామెడీ తో ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక సినిమాను కూడా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలోభాగంగానే ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హీరో నాగ చైతన్య చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
పూరి జగన్నాథ్ బర్త్ డే కు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు
సక్సెస్ ఫుల్ "బద్రి " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన పూరి జగన్నాథ్ "ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ", "ఇడియట్ ", "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ", "పోకిరి ", "దేశముదురు ", "చిరుత ", "టెంపర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ని బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మరో కోణం లో ఆవిష్కరించి పూరి ఘనవిజయం సాధించారు . పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "ను తెరకెక్కిస్తున్నారు.
సుక్కూ - విజయ్ క్రేజీ కాంబినేషన్ కన్ఫామ్
టాలీవుడ్ లో సూపర్ కాంబినేషన్స్ అన్నీ లైన్ కడుతున్నాయి. బన్నీ-కొరటాల, మహేష్-పరుశురాం ఇంకా చాలా ప్రెష్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. అయితే కరోనా వల్ల అసలే ఉన్న సినిమాలకు షూటింగ్ లు లేట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ధైర్యం చేసి షూటింగ్స్ ను మొదలుపెట్టి షూటింగ్ వరకూ పూర్తి చేసుకుంటున్నారు కానీ.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు ఎవరికీ.
రైటర్ గా మారిన రజినీ..!
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేస్తే ఓ పని అయిపోద్దని భావిస్తున్నారట చిత్రయూనిట్. దీనిలో భాగంగానే త్వరలోనే షూట్ ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
పాకిస్థానీ టెర్రరిస్ట్ గా సమంత ..?
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ తాజాగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.
సోషల్ మీడియాలో ప్రభాస్ మరో రికార్డ్
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల ప్రభాస్ ట్విట్టర్ లో మిలియన్స్ లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో రికార్డు ను సొంతం చేసుకున్నాడు.
బాలు విషయంలో నేషనల్ మీడియాపై హరీష్ కౌంటర్
కరోనా కారణంగా ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇక నేడు తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్‌లో అంత్య క్రియలు నిర్వహించారు.
బాలుకు నయన్ నివాళి..నమ్మడానికి కష్టంగా ఉంది
తెలుగు సినీ ప్రేక్షకులను తన గాత్రంతో ఆరు దశాబ్దాలుగా అలరిస్తూ.. గాయకుడిగా ఎన్నో శిఖరాలని అధిరోహించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. ఆయన సినీ ప్రయాణంలో తెలుగు, మలయాళ, తమిళం ఇలా దాదాపు 16 భాషలల్లో 45 వేలకు పైగా పాటలు పాడి బాలు లాంటి మరొక సింగర్ లేరు ఇకపై రారు అనేంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఏ హీరోకు తగినట్టు ఆ హీరోకు పాటలు పాడటం.. పాటలో మాడ్యులేషన్స్.. హీరోనే ఆ పాట పాడుతున్నాడా అనేలా ఉండటం.. ఇలా ఒకటేమిటి బాలును గాన గంధర్వుడిగా చేసిన క్వాలిటీస్ ఎన్నో. అలాంటి గాయకుడు ఇప్పుడు మన మధ్య లేరనే వార్త సినీ ఇండస్ట్రీస్ ను మాత్రమే కాదు ప్రతి…
మరోసారి పొలిటీషియన్ పాత్రలో హీరో సూర్య
తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళ భాషలోనే కాకుండా తెలుగు భాషలో కూడా అభిమానగణం ఎక్కువే. సూర్య హీరోగా తమిళ భాషలో రూపొందిన మూవీస్ తెలుగు భాషలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. 2D ఎంటర్ టైన్ మెంట్స్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా "సూరరై పోట్రు " తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ఆకాశమే నీ హద్దురా " మూవీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లోఅక్టోబర్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.