నేషనల్ - ఇంటెర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న అనుష్క
Anushka Shetty Learns Sign Language For Nishabdham Movie
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నిశ్శబ్దం సినిమా ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్స్,ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన మాధవన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఓ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన మాధవన్ మాట్లాడుతూ ఈ సినిమా ఏదో మల్టీ లాంగ్వేజ్ సినిమా అని ఒప్పుకోలేదు.. కథ తో పాటు ప్రతిఒక్క క్యారెక్టర్ కు అంతే ప్రాధాన్యత ఉంటుంది అని తెలిపాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన అనుష్క కూడా ఏదో మల్టీ లాంగ్వేజ్ సినిమా అని చేయలేదు.. ఈ సినిమాకోసం చాలా ఎఫర్ట్ పెట్టింది.. ఈ సినిమా కోసం అమె ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు అని అనుష్కపై ప్రశంసలు కురిపించారు. . హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
వీడియోస్
00:02:30Nishabdham - Official Trailer (Telugu)
00:01:26Nishabdham Trailer : Telugu
00:01:15Nishabdham TEASER : Telugu
00:01:15Nishabdham TEASER : Hindi
00:01:15


