కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 97

Saripodhaa Sanivaaram first day collections
బాక్సాఫీస్

సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్

మంచి అంచనాల మధ్య నాని నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం సరిపోదా నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.నిర్మాత లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 24.11కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంటుంది.దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 20శాతం కుపైగా రికవరీ చేసింది.అయితే దసరా ఓపెనింగ్స్ ను మాత్రం బీట్ చేయలేకపోయింది.ఇక ఈరోజు కూడా సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ కాగా రానున్న రెండురోజుల్లో ఇదే జోరును కొనసాగించనుంది.

Mahender Reddyవాట్సాప్
Sree Vishnu's Swag Movie Teaser Highlights
ట్రైలర్ & టీజర్

స్వాగ్ టీజర్‌లో ఈ హైలైట్స్ గమనించారా..?

సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు హ్యాట్రిక్ పై కన్నేశాడు. దీనిలో భాగంగా ఆయన మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా 'స్వాగ్' అనే చిత్రం చేస్తున్నాడు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన 'రాజ రాజ చోర' మూవీ హిట్ అనిపించుకుంది.

Srikanth Mవాట్సాప్
hit 3 shooting starts in september
షూటింగ్ అప్‌డేట్

నాని నెక్స్ట్ హిట్ 3నే

ప్రస్తుతం సరిపోదా శనివారం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు నాని.ఇది తనకు వరసగా మూడో హిట్టు.గత ఏడాది దసరా,హాయ్ నాన్న లతో వరసగా బ్లాక్ బాస్టర్ చూశాడు.ఇక ఇప్పుడు సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

Mahender Reddyవాట్సాప్
Thangalaan Crosses 100 Cr Plus Gross Around The Globe
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్‌ లోకి తంగలాన్

కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో ఇది ఒకటి. భారీ నిర్మాణ విలువలు, విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి వెండితెరపై మాయాజాలం చేశాడు. భారీ అంచనాల నడుమ ఈ నెల 15న థియేటర్స్‌ లోకి వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
upcoming updates from Pushpa 2 revealed
సినిమా వార్తలు

పుష్ప 2 అప్డేట్స్ చెప్పేసిన నిర్మాత

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ఎప్పుడు ఎప్పుడు వస్తుందాని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.ఇప్పటికే పలు మార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వాయిదాపడింది.కొత్త డేట్ ప్రకారం డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సివుంది.ఇక ఈసినిమా నుండి ఈమధ్య అప్డేట్స్ ఏమి రాలేదు.అయితే ఈసినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన యలమంచలి రవిశంకర్ కీలకమైన అప్డేట్స్ ఇచ్చాడు.ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని సెప్టెంబర్ 2 లోపు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వెర్షన్ ఇస్తున్నారు.నవంబర్ 20లోపు ఫస్ట్ కాపీ రెడీ చేసి అదే నెల 25న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకునేలా టార్గెట్ పెట్టుకున్నామని అందువల్ల రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ లేదని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6న…

Mahender Reddyవాట్సాప్
NTRNeel shoot starts from October or november
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని తెలిసిందే.రీసెంట్ గా లాంచ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు.ఎన్టీఆర్ డిసెంబర్ నుండి షూట్ లో జాయిన్ కానున్నాడని ఆయన తెలిపారు.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Balakrishna Completes 50 Glorious Years Journey in TFI
సినిమా వార్తలు

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్ళు

టాలీవుడ్‌లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు టాలీవుడ్ అగ్ర హీరో ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలనాటి తెలుగు చలనచిత్ర అగ్ర నటుడు, దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ నటుడిగా నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.

Srikanth Mవాట్సాప్
Ustaad Bhagat Singh Team Will Surprise Power Star Fans on Pawan Kalyan's Birthday
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి.. పవర్‌స్టార్ బర్త్ డేకు స్పెషల్ సర్‌ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలపై దృష్టి సారించబోతున్నారు. గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలలో తీరిక లేకుండా ఉన్న ఆయన త్వరలోనే తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. పవన్ హీరోగా 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' చిత్రాలు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి వివిధ దశలలో నిర్మాణ దశలో వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani and Priyadarshi's Court - State vs A Nobody Motion Poster Released
ఫస్ట్ లుక్

నాని నిర్మాతగా ప్రియదర్శి హీరోగా కొత్త సినిమా.. మోషన్ పోస్టర్ రిలీజ్

వాల్ పోస్టర్ సినిమా కమర్షియల్‌గా విజయవంతమైన మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన కంటెంట్-ఆధారిత చిత్రాలను నిర్మించడంలో గుర్తింపు పొందింది. ఈ బ్యానర్‌లో వచ్చిన చాలా సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. ఈ బ్యానర్ నుండి వచ్చిన ప్రాజెక్ట్‌లకు నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 Teaser Released
ట్రైలర్ & టీజర్

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్

ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మత్తు వదలారా 2'. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్‌ మూవీ 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్‌ గా ఇది తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికోసం మళ్ళీ ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ చేతులు కలిపింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

Srikanth Mవాట్సాప్
Hero Sree Vishnu Says, A Movie Like Swag Never Came on Indian Screen Till Now
సినిమా వార్తలు

స్వాగ్ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్‌లో ఇప్పటివరకూ రాలేదు

కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా 'స్వాగ్' తో అలరించబోతున్నారు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Vetri Maaran’s Vidudala Part 2 Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

విడుదల పార్ట్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించగా.. ప్రముఖ కమెడియన్ టర్న్డ్ హీరో సూరి కథానాయకుడిగా చేసిన మొదటి చిత్రం 'విడుదలై'. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ఈ సినిమా 'విడుదల' పేరుతో డబ్ అయింది. ఇక్కడా మంచి హిట్‌గా నిలిచింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో అందించింది.

Srikanth Mవాట్సాప్
SWAG Teaser Out Now
ట్రైలర్ & టీజర్

స్వాగ్ టీజర్ రిలీజ్

రాజ రాజ చోర తరువాత హీరో శ్రీ విష్ణు- డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్వాగ్. ఇంతకుముందు ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తుంది ఈసినిమా.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈటీజర్ చాలా కొత్తగా అనిపించి సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.ఆడవాళ్లపై మగవారి ఆధిపత్యం అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఈచిత్రం.ఇందులో శ్రీ విష్ణు..రాజు,భవభూతి, సింగ,యయాతి పాత్రల్లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Nani scores Hatric with Saripodhaa Sanivaaram
సినిమా వార్తలు

హ్యాట్రిక్ కొట్టేసిన నాని

అంటే సుందరానికి తరువాత న్యాచురల్ స్టార్ నాని పీక్ సక్సెస్ ను చూస్తున్నాడు.రెండేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఓటిటి లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ పరాభవం నుండి వెంటనే తేరుకొని దసరాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నాని.గత ఏడాది సమ్మర్ లో వచ్చిన ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఆ తరువాత అదే ఏడాది చివర్లో హాయ్ నాన్న తో వచ్చి నాని మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Janaka Aithe Ganaka Trailer Trending No1 on YouTube in India
ట్రైలర్ & టీజర్

ట్రెండింగ్‌లో జనక అయితే గనుక ట్రైలర్

అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
King Nagarjuna As Simon in Coolie
సినిమా వార్తలు

కూలీలో నాగార్జున

సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ ల కూలీకి మరింత స్టార్ పవర్ ఆడ్ అయ్యింది.నిన్నటి నుండి ఈసినిమా లోని పాత్రలను పరిచయం చేస్తూ వస్తుంది టీం.అందులో భాగంగా ఈరోజు మరో పాత్రను పరిచయం చేశారు.ఇక ఆ పాత్ర ఏంటంటే సైమన్.దీన్ని కింగ్ నాగార్జున ప్లే చేస్తున్నాడు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదలచేశారు.ఈపోస్టర్ లో నాగ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాలో నాగార్జున నెగిటివ్ షేడ్స్ లో కనబడనున్నాని టాక్.మొత్తానికి నాగ్ బర్త్ డే రోజు సూపర్ సప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
Aho Vikramaarka Will Connect People of All Regions, Says Director Peta Trikoti
సినిమా వార్తలు

ఈ సినిమా కోసం కీరవాణి గారిని అడగాలా? వద్దా? అనుకున్నా

బ్లాక్‌బస్టర్ 'మగధీర'తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో ఆకట్టుకున్న దేవ్ గిల్ ప్రస్తుతం 'అహో! విక్రమార్క' అంటూ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి వద్ద కో డైరెక్టర్‌గా పని చేసిన పేట త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ మీద నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు త్రికోటి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

Srikanth Mవాట్సాప్
Icon Start Allu Arjun Invited For Nandamuri Balakrishna's Golden Jubilee Celebrations
సినిమా వార్తలు

బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. ఆహ్వానం అందుకున్న అల్లు అర్జున్‌

టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో 50 కనీవినీ ఎరుగని రీతిలో ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Soubin Shahir on board for Coolie
సినిమా వార్తలు

కూలీలో మంజుమ్మల్ బాయ్స్ నటుడు

గత ఏడాది జైలర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్.ఈసినిమా తరువాత రీసెంట్ గా లాల్ సలామ్ తో ప్రేక్షకులను పలకరించాడు అయితే ఇందులో హీరోగా కాదు ఓ కీలక పాత్ర చేశాడు.ఇక రజనీ హీరోగా వేట్టాయాన్ అనే సినిమాను పూర్తి చేశాడు.జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
nagarjuna poster released from kubera
ఫస్ట్ లుక్

కుబేర నుండి నాగ్ పోస్టర్ రిలీజ్

ఈసంక్రాతికి నా సామి రంగతో వచ్చి హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున.ఇక ఈసినిమా తరువాత నాగ్ సోలో హీరోగా ఇంతవరకు మరో సినిమాకు కమిట్ కాలేదు కానీ ప్రస్తుతం కుబేరలో కీలక పాత్ర చేస్తున్నాడు.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన నాగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈరోజు నాగార్జున బర్త్ డే సందర్భంగా తన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో నాగార్జున చాలా కూల్ గా కనిపించాడు.

Mahender Reddyవాట్సాప్

షేర్