కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించగా.. ప్రముఖ కమెడియన్ టర్న్డ్ హీరో సూరి కథానాయకుడిగా చేసిన మొదటి చిత్రం ‘విడుదలై’. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ఈ సినిమా ‘విడుదల’ పేరుతో డబ్ అయింది. ఇక్కడా మంచి హిట్‌గా నిలిచింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇప్పుడు ‘విడుదల: పార్ట్ 1’కి సీక్వెల్‌గా ‘విడుదల: పార్ట్ 2’ వస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ అలా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో విడుదలై: పార్ట్ 2 విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ అందించింది చిత్ర యూనిట్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు నటుడు విజయ్ సేతుపతి ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. విడుదలై 2 చిత్రాన్ని కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో స్పెషల్ ప్రీమియర్ వేయగా దానికి అనూహ్య స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా లేట్ అయినా కూడా మంచి అంచనాలు సెట్ చేసుకుంది. ఇక ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా రెడ్ జెయింట్ మూవీస్, గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ, ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. తెలుగులో దీనిని గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: