టాలీవుడ్‌లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు టాలీవుడ్ అగ్ర హీరో ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలనాటి తెలుగు చలనచిత్ర అగ్ర నటుడు, దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ నటుడిగా నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తొలిసారి ఆయన తెరంగేట్రం చేసిన సినిమా ‘తాతమ్మ కల’. ఇది 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఇందులో బాలకృష్ణ బాలనటుడిగా కనిపించారు. ఈ చిత్రంలో నటించేనాటికి ఆయన వయస్సు కేవలం 14 సంవత్సరాలు కావడం విశేషం. ఈ క్రమంలో నేటితో ఆయన నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు అవుతోంది. ఈ సందర్భంగా ఈ నందమూరి స్టార్ హీరోకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈ సన్మాన వేడుకకు దేశ వ్యాప్తంగా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
ఈ మేరకు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు స్టార్ హీరోలకు ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు దగ్గరుండి చూసుకుంటున్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె.ఎల్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తదితరులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ సన్మాక వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో బాలకృష్ణ సినిమా రంగానికి చేసిన, చేస్తున్న సేవలను పొందుపరిచారు. అలాగే సినిమాల్లో ఆయన సాధించిన రికార్డులను, రాజకీయ, సామాజిక కార్యమాల్లో ఆయన చేస్తున్న సేవలను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక బాలకృష్ణ తన సుదీర్ఘ కెరీర్‌లో ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించారు. ఈ క్రమంలో సాంఘిక, చారిత్రిక, జానపద, పౌరాణిక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, బయోపిక్స్.. ఇలా అన్ని తరహా జానర్లలో నటించడం విశేషం. బాలయ్యకు ‘తాతమ్మకల’ నటుడిగా తొలిచిత్రం కాగా.. హీరోగా మొదటి సినిమా ‘సాహసమే జీవితం’ (1984). 25వ మూవీ ‘నిప్పులాంటి మనిషి’ (1986). 50వ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి (1990). ఇక 75వ చిత్రం ‘కృష్ణబాబు (1999) కాగా.. మైల్ స్టోన్ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ (2017).
17 సినిమాలలో ద్విపాత్రాభినయం చేసి రికార్డ్ సృష్టించారు. నరసింహనాయుడు, సింహా, లెజెండ్ చిత్రాలలోని నటనకు గానూ 3 నంది పురస్కారాలు అందుకోగా, ఇతర సినిమాలకు సంబంధించి 1 సైమా, 6 ఫిలింఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకూ 108 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం 109వ సినిమాలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: