మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ఎప్పుడు ఎప్పుడు వస్తుందాని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.ఇప్పటికే పలు మార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వాయిదాపడింది.కొత్త డేట్ ప్రకారం డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సివుంది.ఇక ఈసినిమా నుండి ఈమధ్య అప్డేట్స్ ఏమి రాలేదు.అయితే ఈసినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన యలమంచలి రవిశంకర్ కీలకమైన అప్డేట్స్ ఇచ్చాడు.ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని సెప్టెంబర్ 2 లోపు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వెర్షన్ ఇస్తున్నారు.నవంబర్ 20లోపు ఫస్ట్ కాపీ రెడీ చేసి అదే నెల 25న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకునేలా టార్గెట్ పెట్టుకున్నామని అందువల్ల రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ లేదని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే పుష్ప 2 నుండి ఇంకో రెండు పాటలు రిలీజ్ చేయాల్సివుంది.సెప్టెంబర్ లో ఒకటి అక్టోబర్ లో మరొకటి రిలీజ్ చేస్తామని చెప్పారు.వినాయక చవితి రోజున ఈసినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఉండవని కూడా చెప్పేశారు.సో సెప్టెంబర్ లో పుష్ప 2 నుండి థర్డ్ సాంగ్ రానుంది.
ఇక ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.ఏమాత్రం హిట్ టాక్ వచ్చిన 1000కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తుండగా రష్మిక కథానాయికగా చేస్తుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా తెలుగు, కన్నడ, మలయాళ ,తమిళ ,హిందీ తోపాటు బెంగాలీ లోకూడా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































